Sankranti Muggulu: అదిరిపోయే సంక్రాంతి ముగ్గుల డిజైన్స్.. ఇంటి ముందు ఇప్పుడే వేయండి..

Sankranti New Muggulu Images 2025: సంక్రాంతి పర్వదినం రోజున తప్పకుండా ఇంటి ముందు ముగ్గులు పెట్టుకుంటారు. కొంతమంది ఇంటి ముందు సాయంత్రం పూట కూడా ముగ్గులు వేస్తారు. ఇలా వేసే వాటిల్లో ఎక్కువగా దీపానికి సంబంధించిన ముగ్గులు ఉంటాయి. మీరు కూడా ఇలాంటి ముగ్గులు వేయాలనుకుంటున్నారా?

Sankranti New Muggulu Images 2025: సంక్రాంతి అంటేనే సందడితో కూడుకున్న పండగ. ఒకవైపు ముగ్గులు, మరోవైపు పందెం కోళ్ళు, గాలిపటాలతో ప్రారంభమయ్యే ఈ పండగ.. ఎంతో ప్రత్యేకమైనది గా భావించవచ్చు. ముఖ్యంగా మహిళలకు ఈ పండగ అన్ని పండగల కంటే ఎంతో సంతోషాన్ని అందిస్తుంది. సంక్రాంతి పండగ రోజున మహిళలంతా ఉదయాన్నే నిద్ర లేచి వాకిలి నిండా వెరైటీ వెరైటీ ముగ్గులను వేస్తూ ఉంటారు. అలాగే ఒకరికి ఒకరు పోటీగా కొత్త కొత్త ముగ్గులను అలంకరించి ఆనందంగా ఈ పండగను జరుపుకుంటారు. 
 

 
1 /7

సంక్రాంతి పండగ అంటేనే ముగ్గుల పండగ.. ఈ పండగ మూడు రోజులపాటు ఇంటిముందు తప్పకుండా ముగ్గులు వేసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. కొంతమంది ఈ పండగ సమయాల్లో ఉదయం పూట ముగ్గులు వేసుకోవడమే కాకుండా రాత్రిపూట కూడా వేసుకుంటూ ఉంటారు.     

2 /7

ఏది ఏమైనా సంక్రాంతి పర్వదినం రోజున తప్పకుండా ఉదయం పూట వాకిట్లో ముగ్గులు వేసుకుంటారు. ఈ సమయంలో చాలామంది కొత్త డిజైన్ కలిగిన ముగ్గులను వేసేందుకు ఆసక్తి చూపుతో ఉంటారు. మీరు కూడా కొత్త డిజైన్తో కూడిన ముగ్గులు వేయాలనుకుంటున్నారా?   

3 /7

కొంతమంది అయితే ఈ సమయంలో దీపాలతో కూడిన ముగ్గులు కూడా వేసుకుంటూ ఉంటారు. సాయంత్రం వేళలో సంక్రాంతి పర్వదినం రోజున దీపాలతో కూడిన ముగ్గు వేసుకోవడం వల్ల సాక్షాత్తు లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని కొందరి నమ్మకం. అందుకే ఈ సమయంలో దీపాల ముగ్గు వేసుకుంటారు.   

4 /7

మీరు కూడా దీపాల ముగ్గు వేసుకుంటారా? అయితే మీ వాకిలికి ఈ డిజైన్ ముగ్గు చాలా పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది. అంతేకాకుండా ఈ ముగ్గు వేయడం కూడా ఎంతో సులభం. ఇందులో ఉండే రెండు దీపాలు చాలా సులభంగా గీయవచ్చు.   

5 /7

ఇక ఇంకో డిజైన్ వివరాల్లోకి వెళితే.. ఇది కూడా చాలా తేలికగా ఉంటుంది.. ఈ ముగ్గులో దీపం పెద్దగా గీయాల్సి ఉంటుంది. అంతేకాకుండా దాని కింద భాగాల్లో పూలను తప్పకుండా గీయడం వల్ల మంచి డిజైన్ను పొందగలుగుతారు.   

6 /7

అందరూ తరచుగా చూసే దీపాల ముగ్గుల్లో ఇది ఒకటి. అయితే ఈ ముగ్గు గీయడం కాస్త కష్టమైనప్పటికీ.. ముందుగా చాక్ పీస్‌తో గీసి ఆ తర్వాత సుద్ధతో గీయాల్సి ఉంటుంది. ఇలా గీసిన ముగ్గులు తప్పకుండా కలర్స్ ఫీల్ చేయండి. 

7 /7

చాలామంది సంక్రాంతి సమయంలో నెమలి దీపం ముగ్గు తరచుగా గీస్తూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఈ కొత్త రకం డిజైన్ కలిగిన నెమలి దీపం ముగ్గును ట్రై చేయండి. ఈ ముగ్గు వేయడం చాలా సులభం..