Muggulu 2025: భోగి పండగ ప్రత్యేకమైన ముగ్గులు.. ఇంటి ముందు వెయ్యడం కూడా చాలా సులభం..

Sankranthi And Bhogi Unique Muggulu: భోగి పండుగ రోజున అందరూ విభిన్న డిజైన్‌తో కూడిన ముగ్గులు వేసుకుంటూ ఉంటారు. మీరు కూడా ఎంతో చక్కగా మీ ఇంటి ముందు మంచి డిజైన్స్‌తో కూడిన ముగ్గులు వేయాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే ఇలా డాట్స్ పెట్టి ముగ్గులు వేయండి.
 

Sankranthi And Bhogi Unique Muggulu 2025: భోగి పండగ అంటేనే అందరికీ గుర్తొచ్చేది ముందుగా ముగ్గులే.. ముఖ్యంగా మహిళల కైతే సంక్రాంతి మూడు రోజులు పెద్ద పండగే అనే చెప్పవచ్చు. ఈ సమయంలో మహిళలంతా ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి ఇంటిముందు అద్భుతమైన చుక్కల ముగ్గులను వేసుకుంటారు. మూడు రోజులపాటు రోజు కుక్క మొగ్గు వేసి వాకిలిని అందంగా తీర్చి దిగుతారు. ఈ సమయంలో కొంతమంది ముత్యాల చుక్కల ముగ్గులు వేస్తే మరికొంతమంది అయితే కొత్త కొత్త డిజైన్స్ తో కలిగిన ముగ్గులు వేస్తూ ఉంటారు. 

1 /5

సంక్రాంతి, భోగి వేళ చాలామంది ధాన్యంతో నిండిన కుండల ముగ్గులను వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో చుక్కలతో కూడిన సంక్రాంతి కుండల ముగ్గులను వేసుకుంటూ ఉంటారు. మూడు రోజులపాటు ఇలాంటి ముగ్గులే ఎక్కువగా వేస్తారు.    

2 /5

కొంతమంది అయితే దాన్యంతో నిండిన కుండల ముగ్గులు వేయడమే కాకుండా చెరుకు గడలతో కూడిన ముగ్గులు, బసవన్న ముగ్గులు వేస్తూ ఉంటారు. ఇది కూడా చాలావరకు ఆకర్షణీయంగా నిలుస్తాయి.   

3 /5

కొంతమంది అయితే కొత్త కొత్త సంక్రాంతి థీమ్స్‌తో వాకిలిని అందంగా తీర్చిదిద్దేందుకు కొత్త డిజైన్స్ కలిగిన ముగ్గులను వేస్తూ ఉంటారు. ప్రత్యేకించి అయితే చుక్కలతో కూడిన ముగ్గులు ఎక్కువగా సంక్రాంతి వేళలో వేస్తారు. పండగ సమయంలో ఎలాంటి ముగ్గు వేసిన వాకిలికే అందం ఇంటికి అందం.   

4 /5

చాలామంది ఈ సమయంలో భోగి కుండలతో కూడిన ముగ్గులు చుక్కలు పేర్చి మరి వేస్తూ ఉంటారు. అయితే మీరు కూడా ఎంతో సులభంగా భోగి రోజున భోగి కుండల చుక్కల ముగ్గు ఈ డిజైన్ చూసుకుంటూ వేయండి. ఇది సింపుల్‌గా వేసుకోవచ్చు.

5 /5

భోగి పండగ రోజున కొంతమంది గంగిరెద్దులతో కూడిన సంక్రాంతి థీమ్ ముగ్గు కూడా వేసుకుంటారు. అయితే ఈ ముగ్గు వేయడం ఎంతో కష్టమైనప్పటికీ కొంతమంది గీతాలు పెట్టి మరీ వేస్తూ ఉంటారు.