Sai Pallavi beauty secret : లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగులో టైర్ -2 హీరోలతో ఎక్కువగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల బాలీవుడ్లోకి కూడా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. రణబీర్ కపూర్ హీరోగా నటిస్తున్న హిందీ రామాయణంలో సీత పాత్రలో నటిస్తోంది.
సాధారణంగా సాయిపల్లవి మేకప్ వేసుకోదని, సహజంగానే నటిస్తుందని అందరూ చెబుతూ ఉంటారు. అయితే ఇంతటి సహజమైన కాంతివంతమైన చర్మం పొందడానికి ఆమె ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది అనే విషయాలు అమ్మాయిలు తెలుసుకోవడానికి తెగ ఆరట పడుతున్నారు. మరి సాయి పల్లవి బ్యూటీ సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
సాయి పల్లవి ఆరోగ్యంగా, అందంగా కనిపించడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తీసుకుంటానని చెప్పుకొచ్చింది. ఇదే నా అందాన్ని కాపాడడమే కాకుండా శరీరం లోపల నుంచి వెలుపల మెరుస్తూ ఉండడానికి కారణం అవుతుందని తెలిపింది. చర్మం నిగనిగలాడడానికి తాజా పండ్లు , కూరగాయలు, గింజలు ఎక్కువగా తింటారని తెలిపింది.
అంతేకాదు రోజు వ్యాయామం చేయడం వల్ల చర్మాన్ని ఆరోగ్యవంతంగా మార్చుకోవచ్చు. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల మంచి శరీరాకృతిని కాపాడుకోవడమే కాకుండా సహజ సౌందర్యాన్ని పెంచుతుంది.
రోజుకు సరిపడా నీరు త్రాగాలి. శరీరాన్ని పునర్జీవింప చేయడానికి నీరు ఎంతగానో సహాయపడుతుంది. ఎక్కువ నీరు త్రాగడం వల్ల మచ్చలు, ముడతలు పోయి మృదువైన చర్మం మీ సొంతం అవుతుంది. ముఖ్యంగా తగినంత నీరు త్రాగని వ్యక్తులలో త్వరగా ముడతలు వచ్చే అవకాశం ఉందట. అలాగే ఆమె మాట్లాడుతూ.. నా జుట్టు అలాగే చర్మ సంరక్షణ కోసం నేను షాంపూ లేదా సింథటిక్ రసాయనాలు కలిపిన సబ్బులను ఎప్పుడు ఉపయోగించను. సహజసిద్ధమైన ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తాను. పైగా నా జుట్టుకి నేను ఏ రోజు రంగులు వేయలేదు అంటూ తెలిపింది.
దీనికి తోడు హానికరమైన మేకప్ ఉత్పత్తులను దూరం చేయండి అంటూ చెప్పుకొచ్చింది. వీటిని ఉపయోగించడం వల్ల చర్మం పైన బొబ్బలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, మొటిమలు చర్మం పగిలిపోవడం, గీతలు పడడం వంటి సమస్యలు ఎక్కువ అవుతాయని సాయి పల్లవి తెలిపింది.ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తాను కాబట్టే తాను నేచురల్ బ్యూటీ అనిపించుకుంటున్నాను అంటూ సాయి పల్లవి తెలిపినట్లు సమాచారం.