Rs 5, 10 and 100 notes: రూ. 5, 10, 100 పాత నోట్లు రద్దు చేస్తారా ?

Rs 5, 10 and 100 notes news: రూ. 500, రూ. 2000 నోట్లు రద్దు చేస్తారంటూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు రకాల కథనాలు వైరల్ అవడం... అందులో ఏ మాత్రం నిజం లేదని ఏదో ఓ సందర్భంలో కేంద్రం తేల్చిచెప్పడం గత రెండేళ్లుగా పరిపాటి అయ్యింది. ఇక ఈ పెద్ద నోట్లను బ్యాన్ చేస్తారని అవాస్తవ కథనాలు ప్రచారం చేసి లాభం లేదనుకున్నారో ఏమో కానీ ఫేక్ రాయుళ్లు కొత్తగా రూ.5, 10, 100 లాంటి చిన్న నోట్లపై పడ్డారు.

  • Feb 03, 2021, 20:37 PM IST

Rs 5, 10 and 100 notes news: రూ. 500, రూ. 2000 నోట్లు రద్దు చేస్తారంటూ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పలు రకాల కథనాలు వైరల్ అవడం... అందులో ఏ మాత్రం నిజం లేదని ఏదో ఓ సందర్భంలో కేంద్రం తేల్చిచెప్పడం గత రెండేళ్లుగా పరిపాటి అయ్యింది. ఇక ఈ పెద్ద నోట్లను బ్యాన్ చేస్తారని అవాస్తవ కథనాలు ప్రచారం చేసి లాభం లేదనుకున్నారో ఏమో కానీ ఫేక్ రాయుళ్లు కొత్తగా రూ.5, 10, 100 లాంటి చిన్న నోట్లపై పడ్డారు. మార్చి 2021 తర్వాత రూ.5, 10, 100 నోట్లు రద్దు అవుతాయంటూ కొత్త ప్రచారానికి తెరతీశారు.

1 /6

రూ.5, 10, 100 నోట్లు రద్దు చేస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో ఈ ప్రచారంపై స్పందించింది.

2 /6

రూ.5, 10, 100 నోట్లను బ్యాన్ చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టంచేసిన PIB.. సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా ఫేక్ న్యూస్ మాత్రమేనని తేల్చిచెప్పింది.

3 /6

రూ.5, 10, 100 నోట్లను బ్యాన్ చేయాల్సిందిగా సూచిస్తూ RBI నుంచి అలాంటి ఆదేశాలు వెలువడలేదని PIB Fact Check ద్వారా ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో వివరణ ఇచ్చింది.

4 /6

గతంలోనూ అనేక సందర్భాల్లో Fact check ద్వారా పీఐబి పలు దుష్ప్రచారాలను, వదంతులను తిప్పికొట్టింది. ( IANS Photo )

5 /6

ముఖ్యంగా కేంద్ర సంక్షేమ పథకాలపై అనేక రకాల ప్రచారాలు వెలుగులోకొచ్చాయి. ఆయా వదంతులు అన్నింటికి చెక్ పెట్టేందుకు ఎప్పటికప్పుడు PIB కృషిచేస్తోంది.

6 /6

ఫేక్ న్యూస్ కథనాలకు చెక్ పెట్టేందుకు వన్ స్టాప్ సొల్యూషన్‌గా మారిన PIB fact check