Rithu Chowdary Back to Form: ఆ బాధ నుంచి బయట పడి మళ్లీ మొదలెట్టిన రీతూ చౌదరి.. దెబ్బకు మానేశారే!

Rithu Chowdary Hot Photos: జీ తెలుగు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమై జబర్దస్త్ ద్వారా మరింత దగ్గరైన రీతు చౌదరి తండ్రి ఇటీవల చనిపోవడంతో ఆమె చేస్తున్న అన్ని సోషల్ మీడియా పోస్టుల మీద నెటిజనులు విరుచుకుపడుతూ ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది ఆ వివరాలు లోకి వెళ్తే
 

  • Feb 26, 2023, 11:08 AM IST

Rithu Chowdary Latest Hot Photoshoot : రీతూ చౌదరి జీ తెలుగు సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే యశస్వి కొండేపూడిని స్టేజి మీదనే హగ్ చేసుకోవడం ద్వారా ఆమె ఒక్కసారిగా సోషల్ మీడియా ద్వారా మరింత పాపులారిటీ తెచ్చుకుంది. 

1 /5

తర్వాత జీ తెలుగు సీరియల్స్ లో చేస్తూనే ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ వంటి ప్రోగ్రామ్స్ లో కనిపిస్తూ వచ్చిన ఆ భామ మరింత పాపులారిటీ దక్కించుకుంది.     

2 /5

ఈ మధ్యకాలంలో ఆమె ఒక పొలిటీషియన్ ని పెళ్లి చేసుకోబోతుందని ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది,  కానీ ఆ వార్తలు నిజమవలేదు. ఇక కొన్నాళ్ల క్రితం ఆమె తండ్రి చనిపోయినట్లుగా ఆమె స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించి తన బాధను వ్యక్తం చేసింది.     

3 /5

అయితే ఆ తర్వాత ఆమె కాస్త రొమాంటిక్ పాటలకు రీల్స్ చేస్తూ,  రిలీజ్ చేసిన ఫోటోలు షేర్ చేసిన ఆమె మీద నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉండేవారు. తండ్రి చనిపోయి రోజులు కూడా గడవ లేదు ఇదేం పోయేకాలం అంటూ మండి పడేవారు. అయితే ఆవిడ తెలివిగా కొన్నాళ్లపాటు బాధాకరమైన రీల్స్ కి డాన్సులు చేస్తూ కనిపించింది.     

4 /5

 వాస్తవానికి దగ్గర వారు దూరమైనప్పుడు ఆ బాధ అందరికీ ఉంటుంది కానీ రీతు చౌదరి వృత్తిరీత్యా సోషల్ మీడియాలో నిత్యం అభిమానులతో టచ్ లో ఉండాల్సి రావడంతో ఇలా రీల్స్ షేర్ చేస్తుందని భావించవచ్చు.     

5 /5

దీంతో ఇప్పుడు అలాంటి కామెంట్లు చేసే వారంతా సైలెంట్ అయిపోయారు,  వాళ్ళు సైలెంట్ అయిపోవడంతో ఆమె మళ్లీ పని తిరిగి మొదలు పెట్టింది.