Redmi Note 10 Pro Vs Redmi Note 13 Pro: ప్రస్తుతం మార్కెల్లో ఎక్కువ అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్స్‌లో రెడ్మి నోట్ 10 ప్రో, రెడ్మి నోట్ 13 ప్రో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎందుకంటే ఈ మొబైల్స్ ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరల్లోనే లభిస్తున్నాయి. కాబట్టి చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ రెండింటిలో ఏ స్మార్ట్‌ఫోన్ బెస్టో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ రెండింటి ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ మధ్య తేడాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ ప్రాసెసర్ వివరాల్లోకి వెళితే, రెడ్మి నోట్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 732G ప్రాసెసర్‌తో లభిస్తోంది. ఇక రెడ్మి నోట్ 13 ప్రో మొబైల్ MediaTek Helio G99 ప్రాసెసర్‌లో అందుబాటులో ఉంది. అయితే ఈ రెండు ప్రాసెసర్లలో రెడ్మి నోట్ 13 ప్రో మొబైల్దే చాలా బెస్ట్ అని చెప్పొచ్చు..
కెమెరా వివరాల్లోకి వెళితే, రెడ్మి నోట్ 10 ప్రో మొబైల్ 108MP ప్రధాన సెన్సార్ రియర్ కెమెరాతో లభిస్తోంది. ఇక రెడ్మి నోట్ 13 ప్రో మొబైల్ 50MP ప్రధాన సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరాతో అందుబాటులో ఉంది. కెమెరా పరంగా నోట్ 10 ప్రో చాలా బెస్ట్‌గా భావించవచ్చు.
ఇక ఈ రెండు స్మార్ట్‌ఫోన్స్ బ్యాటరీల వివరాల్లోకి వెళితే, రెడ్మి నోట్ 10 ప్రో స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 5020mAh బ్యాటరీతో లభిస్తోంది. ఇక రెడ్మి నోట్ 13 ప్రో మొబైల్ మాత్రం 5000mAh బ్యాటరీతో అందుబాటులో ఉంది.
ఈ మొబల్స్ ర్యామ్ పరంగా చూస్తే..రెడ్మి నోట్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్స్ 8GB ర్యామ్‌తో లభిస్తోంది. అయితే రెడ్మి నోట్ 10 ప్రో మొబైల్ మాత్రం 6GB ర్యామ్‌తో అందుబాటులో ఉంది. రెడ్మి నోట్ 13 ప్రో 5G కనెక్టివీటికి సపోర్ట్ చేస్తుంది..రెడ్మి నోట్ 10 ప్రో మాత్రం 4G మాత్రం సపోర్ట్ చేస్తుంది.
ఈ రెండింటిలో ఏది బెస్ట్ అంటే..గేమింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టే వారైతే, రెడ్మి నోట్ 10 ప్రో మంచి ఎంపికగా భావించ్చు. కానీ ఇందులో 5G కనెక్షన్ సపోర్ట్ ఉండదు. ప్రీమియం ఫీచర్స్, ప్రాసెసర్ పరంగా రెడ్మి నోట్ 13 ప్రో స్మార్ట్‌ఫోన్ మంచి ఎంపికగా భావించవచ్చు.