Recurring Deposit vs Fixed Deposit : పోస్టాఫీసులోనూ బ్యాంకుల్లోనూ అందుబాటులో ఉండే రికరింగ్ డిపాజిట్ స్కీం గురించి ఎప్పుడైనా విన్నారా..అయితే ఈ స్కీం వల్ల కలిగే లాభాలు ఏంటి..? దీనికి ఫిక్స్డ్ డిపాజిట్ స్కీంకు ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం.
Recurring deposit vs fixed deposit : మార్కెట్లో స్టాక్ మార్కెట్, బంగారం, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ ఎన్ని ఉన్నప్పటికీ బ్యాంకులో ఆఫర్ చేసే పథకాల్లో డబ్బు దాచుకుంటే మీకు ఖచ్చితంగా స్థిరమైన ఆదాయం, వడ్డీ లభిస్తుందనే పేరు చాలా కాలంగా ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ బ్యాంకుల పట్ల జనాల్లో ఎక్కువగా నమ్మకం కూడా ఉంటుంది. దీంతో ధైర్యంగా ఫిక్స్డ్ డిపాజిట్లను చేసేందుకు జనం ఆసక్తి చూపిస్తుంటారు.
అయితే ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలంటే మీ వద్ద ఎక్కువ మొత్తంలో డబ్బు ఉండాల్సి ఉంటుంది. పైగా ఆ డబ్బులు మీరు బ్యాంకులో చాలా కాలం పాటు ఫిక్స్డ్ చేయాల్సి రావచ్చు. అయితే ఫిక్స్డ్ డిపాజిట్ విషయంలో కొన్ని ప్రతికూలతలు ఉన్నాయి. ముందు మన వద్ద పెద్ద మొత్తంలో డబ్బులు లేనప్పుడు ఈ పథకాల్లో పొదుపు చేయలేము. అయితే తక్కువ మొత్తం డబ్బు డిపాజిట్ చేస్తే అప్పుడు మీకు వడ్డీ ఆదాయం తక్కువగా వస్తుంది. అయితే బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్లతో పాటు కస్టమర్లను ప్రత్యామ్నాయంగా రికరింగ్ డిపాజిట్లను సైతం సేకరిస్తుంటాయి.
ఒకేసారి ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరి కాకుండా, కొద్ది మొత్తంలో డబ్బును ప్రతి నెల డిపాజిట్ చేయడం ద్వారా మీరు మంచి వడ్డీ ఆదాయం పొందే వీలుంది. ప్రతి నెల డబ్బులను చెల్లించడం ద్వారా ఫిక్స్డ్ డిపాజిట్లపై ఎంత వడ్డీ మీకు లభిస్తుందో ఈ స్కీంలో కూడా అంతే వడ్డీ లభిస్తుంది. దాని పేరే రికరింగ్ డిపాజిట్.
ప్రతినెలా నిర్ణీత మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయడం ద్వారా మెచ్యూరిటీ అనంతరం మీకు నిర్ణీత మొత్తాన్ని వడ్డీ కలిపి చివర్లో పెద్ద మొత్తంలో డబ్బు మీకు లభిస్తుంది. పోస్ట్ ఆఫీసులో సైతం ఈ రికరింగ్ డిపాజిట్ లను పెద్ద ఎత్తున అమలు చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో చిన్న మొత్తాల పొదుపు సాధనంగా మారిన ఈ పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్లు కస్టమర్లకు మంచి మొత్తంలో వడ్డీని అందిస్తాయి.
సేవింగ్స్ ఖాతా తో పోల్చి చూసినట్లయితే రికరింగ్ డిపాజిట్ లో మీరు చివర్లో డబ్బుపై వడ్డీని పెద్ద మొత్తంలో పొందే అవకాశం ఉంటుంది. పోస్ట్ ఆఫీస్ లతోపాటు అన్ని ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకుల సైతం ఈ రికరింగ్ డిపాజిట్ స్కీములను ప్రవేశపెడుతున్నాయి. ఈ స్కీములలో కనీసం వెయ్యి రూపాయల చొప్పున ఐదు సంవత్సరాల పాటు చెల్లిస్తే మీకు రికరింగ్ డిపాజిట్ కింద మంచి మొత్తం లభిస్తుంది.
ఉదాహరణకు నెలకు 1000 చొప్పున మీరు పోస్టాఫీసు రికరింగ్ డిపాజిట్ స్కీంలో పొదుపు చేస్తే మీకు 5 సంవత్సరాల తర్వాత మీరు పొదుపు చేసిన రూ. 60,000పై 12,000 వరకూ వడ్డీ లభిస్తుంది. తద్వారా మీకు చివరకు రూ. 72000 వరకూ లభిస్తుంది.