Realme Neo 7 Se Price In India: రియల్‌మీ నుంచి మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ రియల్‌మీ 14 ప్రో సిరీస్ పేరుతో విడుదుల చేయబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను ప్రపంచ వ్యాప్తంగా Realme Neo 7 SE పేరుతో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇటీవలే లీక్ అయ్యాయి.
ఈ Realme Neo 7 SE స్పెసిఫికేషన్స్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 8400 Max చిప్‌సెట్‌లో విడుదల కాబోతోంది. ఈ మొబైల్ మల్టీ టాస్కింగ్ చేసుకునేవారికి చాలా బాగుంటుంది. అలాగే గేమింగ్ చేసేవారికి కూడా చాలా బాగా పని చేస్తుంది.
ఈ Realme Neo 7 SE మొబైల్ అద్భుతమైన డిజైన్‌తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీని డిస్ల్పే ప్రీమియం 1.5k పిక్సెల్ రిజల్యూషన్‌తో కూడిన ఫ్లాట్ OLED స్క్రీన్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం.
ఇక ఈ మొబైల్ పవర్‌ఫుల్ 80W ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 7000mAh బ్యాటరీ ప్యాక్‌తో విడుదల కాబోతోంది. ఇది సిలికాన్ కార్బన్ బ్యాటరీని కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అతి శక్తివంతమైన కెమెరాతో లాంచ్ కానుంది.
ఇక దీని బ్యాక్ సెటప్ కెమెరా వివరాల్లోకి వెళితే..దీని ప్రైమరీ కెమెరా 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 లెన్స్‌తో విడుదల కానుంది. అంతేకాకుండా అద్భుతమైన సెకండరీ లెన్స్, అల్ట్రావైడ్ లెన్స్ కెమెరాలు కూడా ఉంటాయి.
ఈ Realme Neo 7 SE స్మార్ట్‌ఫోన్‌లో ఆప్టికల్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ప్రత్యేకమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అలాగే ప్రీమియం కలర్ ఆప్షన్స్‌లో విడుదల కాబోతోంది.