Realme 5g smartphone: అతి తక్కువ ధరలో 5జి స్మార్ట్‌ఫోన్ వచ్చేస్తుంది

  • Nov 13, 2020, 17:58 PM IST

ఇప్పుడు అతి తక్కువ ధరలోనే 5 జి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయవచ్చు. రియల్ మి కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ఇటీవలే రియల్ మి 7 సిరీస్‌లో భాగంగా మార్కెట్లో 3 ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి రియల్ మి 7, 7 ప్రో, 7 ఐ గా ఉన్నాయి. 

పండుగ వేళ 5జి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటే...ఇదే మంచి అవకాశం.ఇప్పుడు అతి తక్కువ ధరలోనే 5 జీ స్మార్ట్‌పోన్ పొందవచ్చు. రియల్ మి కంపెనీ నవంబర్ 19న రియల్ మి 7 5జి ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేయనుందని ప్రకటించింది. వర్చ్యువల్ ఈవెంట్ ద్వారా రియల్ మి ..5 జి ఫోన్‌ను లాంచ్ చేయనుంది. 

1 /5

రియల్ మి ట్వీట్ ద్వారా లాంచ్ చేయబోతున్న రియల్ మి7  5జి స్మార్ట్‌ఫోన్  ఫోటోను షేర్ చేసింది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్ ఉంటుంది.   

2 /5

రియల్ మి కంపెనీ ఇంతకుముందే రియల్ మి 7ఐను లాంచ్ చేసింది. స్మార్ట్‌ఫోన్ 6.5 ఇంచెస్ డిస్ ప్లేతో ఉంటుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 662 ప్రోసెసర్‌తో ఉంటుంది. ఇందులో 8 జిబి ర్యామ్, 128 స్టోరేజ్ ఉంది.   

3 /5

రియల్ మి కంపెనీకు చెందిన ఈ  స్మార్ట్‌ఫోన్ 11 వేల 999 రూపాయల ప్రారంభధరలో అందుబాటులో ఉండనుంది. ఈ ధరలో 4 జిబి ర్యామ్ 64 జిబి స్టోరేజ్ ఉంటుంది. ఇదే ఫోన్ 4 జిబి ర్యామ్, 128 స్టోరేజ్ తో మాత్రం 12 వేల 999 రూపాయలకు లభించనుంది.   

4 /5

రియల్ మి కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌ను ఫ్యూజర్ గ్రీన్, ఫ్యూజన్ బ్లూ రంగుల్లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్ 16న అందుబాటులో వస్తుంది. రియల్ మి ఆన్‌లైన్ స్టోర్ లేదా ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది.   

5 /5

8ఎంపి అల్ట్రా‌వైడ్ యాంగిల్ లెన్స్, 2 ఎంపి మోనోక్రోమ్ సెన్సార్, 2 ఎంపి డెప్త్ సెన్సార్‌తో పాటు 64 ఎంపీ ప్రైమరీ కెమేరాతో క్వాడ్ కెమేరా సెటప్‌ను సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీ కోసం 16 ఎంపి సెన్సార్ ఉంది. ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంది.