Friendship day 2024: సౌత్ సినీ ఇండస్ట్రీలో రియల్ లైఫ్ ఫ్రెండ్స్.. విడదీయలేని బంధం వీరిదే!
సౌత్ సినీ ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ గురించి మాట్లాడాలి అంటే కచ్చితంగా గుర్తుకొచ్చే పేర్లు మోహన్ లాల్, మమ్ముట్టి. ప్రొఫెషనల్ గా వాళ్ళ మధ్య ఎంత పోటీ ఉన్నప్పటికీ వాళ్ళ ఫ్రెండ్ షిప్ మాత్రం చెక్కుచెదరలేదు. చాలా సినిమాలలో కలిసి నటించడం ద్వారా వాళ్లు తమ బంధాన్ని మరింత బలపరుచుకున్నారు.
మణిరత్నం తెరకెక్కించిన అయుత ఎళుత్తులో కలిసి నటించిన సూర్య, మాధవన్ ఆ తర్వాత మంచి ఫ్రెండ్స్ గా మారారు. తరచూ బయట ఫ్యామిలీస్ తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సూర్య 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై జ్యోతిక హీరోయిన్ గా నిర్మించిన మగళిర్ మట్టుమ్ మూవీలో మ్యాడీ అతిధి పాత్రలో నటించాడు. అలాగే మాధవన్ చిత్రం రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్, తమిళ వెర్షన్లో సూర్య కీలక పాత్ర పోషించాడు.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కించిన మహానటి చిత్రంలో విజయ్ దేవరకొండ, సమంతతో కలిసి నటించాడు. సినిమాలో ఇద్దరు ప్రేమికులుగా.. నటించారు కానీ సెట్స్ లో మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. రీసెంట్ గా ఈ ఇద్దరు ఖుషి మూవీ తో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.
దుల్కర్ సల్మాన్,నజ్రియా నజీమ్ సోషల్ మీడియా వేదికగా.. ఒకరి విజయాన్ని మరొకరు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. 2014లో వచ్చిన బెంగుళూరు డేస్.. మూవీలో కలిసిన ఈ ఇద్దరు స్టార్స్.. ఆ సినిమా టైంలో మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ఈ ఇద్దరు కలిసి మరెన్నో సినిమాల్లో కూడా నటించారు. ఈ ఇద్దరి లైఫ్ పార్ట్నర్స్ అమల్ , ఫహద్ ఫాసిల్ కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కావడం విశేషం.
స్టార్ హీరోయిన్స్ లో కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు.. అలా ప్రస్తుతం సౌత్‌లో బాగా ఫేమస్ అయిన ఫ్రెండ్స్ కాజల్ అగర్వాల్, తమన్నా భాటియా. ఈ ఇద్దరు ఇప్పటివరకు ఒకసారి కలిసి నటించి ఉండకపోవచ్చు కానీ కెరీర్ ప్రారంభ దశ నుంచి.. ఒకరికి ఒకరు సపోర్టిస్తూ వస్తున్నారు. 2020లో తన ఇన్‌స్టాగ్రామ్‌లో.. ఆస్క్ మీ ఎ క్వశ్చన్ సెషన్లో.. తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని తమన్నాని అడగగానే వెంటనే కాజల్ పేరు చెప్పింది. ఇక అప్పటినుంచి ఈ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అందరికీ అర్థమైంది.
ప్రభాస్ కరీర్ ని మార్చిన ఛత్రపతి సినిమా సమయంలో రాజమౌళితో అతనికి స్నేహం కుదిరింది. రాజమౌళి రాఘవేందర్ రావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి అతనికి ప్రభాస్ తో పరిచయం ఉంది. ఆ పరిచయం బాహుబలికి బాగా బలపడింది. బయట ఏ ఈవెంట్ జరిగినా ఈ ఇద్దరు ఎంతో సందడి చేస్తూ ఉంటారు.
‘అపూర్వ రాగంగల్’ అనే మూవీ తో 1975లో నటుడిగా అరంగేట్రం చేసిన సమయం నుంచి రజినీకాంత్ ,కమల్ హాసన్ మధ్య స్నేహబంధం ఏర్పడింది. ఈ ఇద్దరి ఫ్రెండ్షిప్ సుమారు 5 దశాబ్దాలుగా కొనసాగుతోంది. కెరీర్ పరంగా ఉన్న పోటీ ఈ ఇద్దరి బంధాన్ని మరింత బలపరిచింది. ఎప్పుడు ఎక్కడ కలిసినా ఇద్దరు ఎంతో ఆనందంగా ఉంటారు.
ఫ్రెండ్షిప్ అనేది కేవలం చదువుకునే పిల్లలకే పరిమితం కాదు.. పెద్దయ్యాక మనకు పని చేసే దగ్గర కూడా ఎంతోమంది ఫ్రెండ్స్ తోడు అవుతూ ఉంటారు. అలాగే మన సౌత్ సినీ ఇండస్ట్రీలో కూడా మనకు తెలియకుండా ఎందరో బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు.రాబోయే ఫ్రెండ్షిప్ డే సందర్భంగా.. మన సౌత్ సినీ ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ అనే పదానికి.. నిజమైన నిర్వచనం చెప్పిన స్టార్స్ ఎవరో ఓ లుక్కేద్దాం పదండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.