RBI Big Decision: పెన్షనర్లకు చేసిన అదనపు పెన్షన్ రికవరీపై RBI కీలక నిర్ణయం

పెన్షనర్లకు చేసిన అదనపు పెన్షన్ రికవరీపై RBI కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షనర్లకు తాత్కాలికంగా ఊరట కలిగించే వార్తను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించింది.

RBI Big Decision: పెన్షనర్లకు చేసిన అదనపు పెన్షన్ రికవరీపై RBI కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షనర్లకు తాత్కాలికంగా ఊరట కలిగించే వార్తను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించింది.

1 /5

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI Latest Update) ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదల చేసింది. ‘ పెన్షనర్లకు చేసిన అదనపు పెన్షన్ రికవరీపై జారీ చేసిన సర్క్యులర్లను ఉపసంహరించుకోవాలి’ అంటూ ఆర్‌బీఐ నోటిఫికేషన్ వెలువరించింది. పెన్షనర్ల నుండి అదనపు లేక తప్పిద పెన్షన్ చెల్లింపులను తిరిగి పొందడం అనేది ప్రస్తుత మార్గదర్శకాలకు, కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జరగడం లేదని తమ దృష్టికి వచ్చినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. Also Read: EPF Wage Ceiling: ఈపీఎఫ్ పరిమితి రూ.15,000 నుంచి రూ.21,000కు పెంచే యోచనలో ప్రభుత్వం

2 /5

పెన్షనర్లకు బ్యాంకులు చెల్లించిన అదనపు పెన్షన్ రికవరీకి సంబంధించి ప్రభుత్వ శాఖలుగానీ మరియు బ్యాంకులుగానీ జారీ చేసిన  సర్క్యులర్ నెంబర్ DGBA.GAD.No.2960/45.01.001/2015-16 మార్చి 17, 2016 సర్క్యులర్ నెంబర్ CO.DGBA (NBS) No.44/GA.64 (11-CVL) 90/91 ఏప్రిల్ 18, 1991 సర్క్యులర్ నెంబర్ CO DGBA (NBS) No.50/GA.64 (11-CVL) 90/91 మే 6, 1991 తేదీల పేరిట జారీ అయిన సర్క్యూలర్ ఉపసంహరించుకోవాలని తెలిపింది.

3 /5

ఆర్‌బీఐ సంతకంతో జారీ చేసిన పైన పేర్కొన్న సర్క్యులర్లు ఉపసంహరించుకున్నప్పటికీ, అదనపు పెన్షన్(EPFO Latest News) రికవరీ కోసం అనుసరించాల్సిన ప్రక్రియకు సంబంధించి పెన్షన్ మంజూరు అధికారుల నుండి మార్గదర్శకత్వం పొందాలని ఏజెన్సీ బ్యాంకులు అభ్యర్థిస్తున్నాయి.  Also Read: EPF Interest Rate: ఈపీఎఫ్ వడ్డీ ఖాతాకు రాలేదా.. ఇలా ఫిర్యాదు చేయండి

4 /5

అదనపు పెన్షన్ చెల్లింపులు లేక తప్పిద పెన్షన్ చెల్లింపుల నగదు ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. జూన్ 1, 2009 నాటి తమ సర్క్యులర్లు DGBA.GAD.H10450 / 45.03.001 / 2008-09 మరియు DGBA.GAD.H.4054 / 45.03.001 / 2014-15 మార్చి 13, 2015 బ్యాంకులకు మార్గదర్శకాలు జారీ చేశారు. అదనపు పెన్షన్ చెల్లింపుల విలువ ఎంత మొత్తం తెలుసుకుని ప్రభుత్వానికి సాధ్యమైనంత త్వరగా చెల్లించాలని ఏజెన్సీ బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది.

5 /5

కాగా, బ్యాంక్ చేసిన తప్పుల కారణంగా అదనపు పెన్షన్ చెల్లింపులు జరిగినప్పుడు, పింఛనుదారుల నుండి నగదును తిరిగి పొందడం కోసం ఎదురుచూడకుండా, దానిని గుర్తించిన వెంటనే అధిక మొత్తంలో నగదును ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిన బాధ్యత బ్యాంకులపైనే ఉందని ఆర్‌బీఐ తన తాజాగా నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. Also Read: EPFO: ఈపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ జమ అయిందా లేదా ఇలా తెలుసుకోండి