Rasi Phalalu 2024: 2024లో బుధుడు 3 సార్లు తిరోగమనం..ఈ రాశుల వారికి నష్టాలే..నష్టాలు..


Rasi Phalalu 2024: జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధ గ్రహం రాబోయే 2024 సంవత్సరంలో మొత్తం మూడుసార్లు తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారు ఊహించని నష్టాల బారిన పడతారు. అంతేకాకుండా ప్రేమ జీవితంలో కూడా కొన్ని కొన్ని ఆటంకాలు వస్తాయి. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

  • Dec 20, 2023, 22:06 PM IST

Rasi Phalalu 2024: ప్రతి ఒక్క గ్రహం ఏదో ఒక సమయంలో రాశి సంచారం చేస్తుంది. అంతేకాకుండా కొన్నికొన్ని సందర్భాల్లో గ్రహగమనాల్లో మార్పులు వచ్చి తిరుగమనం దిశలో కూడా తిరుగుతుంది. అయితే గ్రహాలు సంచారం చేయడం కారణంగా అన్ని రాశుల వారిపై ఎంత ప్రభావం పడుతుందో.. తీరోగమనం చేయడం కారణంగా కూడా అంతే ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.  గ్రహాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే తీరుగమనం చేస్తాయి. ప్రతి సంవత్సరంలో ఒక్కొక్క గ్రహం ఒకటి నుంచి రెండుసార్లు తిరోగమనం చేసే అవకాశాలున్నాయి.

1 /5

రాబోయే 2024 సంవత్సరంలో జ్యోతిష్య శాస్త్రంలో గొప్ప ప్రాముఖ్యత కలిగిన బుధ గ్రహం తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు కలిగితే మరికొన్ని రాశుల వారికి అనేక రకాల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతి నెల బుధ గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంది.  దీని కారణంగా ప్రత్యేక ప్రభావం ఏర్పడుతుంది.

2 /5

రాబోయే 2024 సంవత్సరంలో బుధ గ్రహం మొత్తం 3 నుంచి 4 సార్లు తిరోగమనం చేయబోతోంది. అంతేకాకుండా మొదట బుధ గ్రహం జనవరి 2వ తేదీన ప్రత్యక్ష సంచారం చేయబోతోంది. ఈ సంచారం కారణంగా జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో కీలకమైన గ్రహాలపై ప్రత్యేక ప్రభావం పడబోతోంది. అయితే ఈ సంచారం కారణంగా ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకోండి.  

3 /5

బుధ గ్రహం 2024లో మొదటగా ఏప్రిల్ 24వ తేదీన మేష రాశిలో తిరోగమనం చేయబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి తీవ్ర ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో మేష రాశి వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాలి. ఈ తిరోగమనం కారణంగా ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.

4 /5

2024లో ఆగస్టు 4 నుంచి 27 వరకు సింహ రాశిలో బుధుడు తిరోగమన దశలో ఉండబోతున్నాడు. దీని కారణంగా ఈ సింహ రాశి వారు ప్రేమ జీవితంలో సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని మాటలతో పరిష్కరించుకోవడం చాలా మేలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

5 /5

బుధుడు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు ధనస్సు రాశిలో తిరోగమన దశలో ఉండబోతున్నట్లు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా ధనస్సు వారికి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా పనుల్లో ఆటంకాలు ఎదురవడం, చిన్నచిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి.