Pushpa 2 Update: అల్లు అర్జున్ స్టార్ ఇమేజ్ ని విపరీతంగా పెంచి టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో.. పెను సంచలనంగా నిలిచిన చిత్రం పుష్ప. ఈ మూవీకి సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ విడుదల ఆలస్యమైంది అని అందరూ భావిస్తున్నారు.. అయితే దీని వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటో శ్రీవల్లి రివీల్ చేసింది.
గతంలో ఒక సినిమాకి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు అంటే కచ్చితంగా ఆ డేట్ కి మూవీ రిలీజ్ అయ్యేది. కానీ ప్రస్తుతం అలా జరగడం లేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఫ్యాన్ ఇండియన్ చిత్రాల చిత్రీకరణ అంతకంతకు ఆలస్యం అవుతుంది. ఒక్కసారి ఇచ్చిన డేట్ ని రెండు మూడు సార్లు మార్చిన సందర్భాలు ఉన్నాయి.
అల్లు అర్జున్ పుష్ప 2 చిత్రం పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. నిజానికి ఆగస్టు 15 విడుదల అవ్వాల్సిన ఈ చిత్రం డిసెంబర్ 6 కి పోస్ట్ ఫోన్ చేయబడింది. మరి డిసెంబర్ 6 కన్నా విడుదలవుతుందా అంటే దానిపై కూడా స్పష్టత లేదు.
పుష్ప మూవీ సృష్టించిన క్రేజ్ తర్వాత దాని సీక్వెల్ పై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా మూవీ విడుదల కాబోతున్నట్లు ఎప్పుడో అధికారికంగా ప్రకటించారు. మూవీ షూటింగ్ , గ్రాఫిక్స్ లాంటి కారణాలవల్ల మూవీ షూటింగ్ అంతకంత డిలే అవుతూ వచ్చింది. మూవీకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికీ పెండింగ్ ఉండడంతో సినిమా విడుదల డిసెంబర్ 6 కి పోస్ట్ ఫోన్ చేశారు.
మొదట్లో మూవీని ఆగస్టు 15 కే ..విడుదల చేయడానికి చిత్ర బృందం ఎంతో ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో మూవీపై బస్ క్రియేట్ చేయడానికి రెండు పాటలను కూడా ముందుగానే రిలీజ్ చేశారు. పుష్ప టైటిల్ సాంగ్ తో పాటు సెకండ్ సింగిల్ కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇక పుష్ప లోని నా సామి సాంగ్ హుక్ స్టెప్ లాగా పుష్ప 2 లో హైలెట్ అయిన హుక్ స్టెప్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే ఈ హుక్ స్టెప్ కు మూవీ షూటింగ్ ఆలస్యం అవ్వడానికి మధ్య కనెక్షన్ ఉంది అన్న విషయం మీకు తెలుసా?
ఈ విషయాన్ని స్వయంగా శ్రీవల్లి రివిల్ చేసింది. ఈ హుక్ స్టెప్ కెమెరా లను మార్చి చేస్తూ పూర్తి చేయాలట. మామూలుగా..అయితే ఇటువంటివి చేయడం చాలా కష్టం. కెమెరా లెన్స్ కి సెట్ అయ్యే విధంగా ఆ హుక్ స్టెప్ పూర్తి చేయడానికి చాలా రోజులు షూటింగ్ జరిగినట్టు రష్మిక ఇండియన్ ఐడల్ సోలో రివిల్ చేసింది. రష్మిక చెప్పిన ఈ న్యూస్ మూవీ షూటింగ్ ఎందుకు ఆలస్యం అవుతోంది అన్న విషయంపై స్పష్టత ఇచ్చింది. ఈ నేపథ్యంలో మూవీ డిసెంబర్ 6న విడుదలవుతుందా లేక 2025 కి పోస్ట్ పోన్ అవుతుందా అన్న విషయం డైలమాలో ఉంది.