Rashmika Mandanna: పచ్చ డ్రెస్ లో మెరిసిపోయిన రష్మిక.. అదిరిపోయింది అంటున్న ఫ్యాన్స్

Rashmika Mandanna Instagram Photos : 
అందం,‌ అభినయం ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరిని ప్రేమలో పడేస్తున్నాయి.
 

1 /5

పుష్ప సినిమాతో పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకునేది రష్మిక. అయితే ఈ సినిమా కన్నా ముందే రష్మికాకు తెలుగులో ఎంతో క్రేజ్ ఉంది. ముఖ్యంగా ఈ హీరోయిన్ చేసిన గీతాగోవిందం చిత్రం తెలుగులో మంచి విజయం సాధించి ఆమెకు ఎంతో పేరు తెచ్చి పెట్టింది.

2 /5

విజయ్ దేవరకొండ తో చేసిన గీతాగోవిందం సినిమాతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన రష్మిక. ఆ తరువాత నుంచి తెలుగులో వరస అవకాశాలు అందుకుంటు దూసుకుపోయింది.

3 /5

కిరిక్ పార్టీ అనే కన్నడ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రష్మికాకు తెలుగు భాషలోనే అభిమానులు ఎక్కువ. అయితే ప్రస్తుతం అన్ని భాషలలో కూడా ఈమెకు ఆఫర్ల పైన ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

4 /5

ఈ మధ్యనే తెలుగు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ హిందీలో తీసిన యానిమల్ చిత్రంతో మరో పాన్ ఇండియా సూపర్ హిట్ అందుకుంది ఈ నటి. ప్రస్తుతం తనకు ఎంతో విజయం అందించిన పుష్ప సినిమా సీక్వెల్ పుష్ప 2 చిత్రంతో బిజీగా ఉంది.

5 /5

ఈ క్రమంలో ఎంతో అందమైన గ్రీన్ డ్రెస్సులో రష్మిక షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ ఫోటోలు వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి.