Rashmika Mandanna: చీరలో రష్మిక అందాలు.. అదరహో అంటున్న అభిమానులు

Rashmika Mandanna Hot Pics: 
కర్ణాటక బ్యూటీ రష్మికా మందన్న తన సినిమాల ద్వారా తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం చీరలో రష్మిక షేర్ చేసిన ఫోటోలు అందరినీ తెగ ఆకట్టుకుంటూ వైరల్ అవుతున్నాయి.

  • Feb 28, 2024, 19:05 PM IST
1 /6

కిరిక్ పార్టి అనే కన్నడ చిత్రం తో సినిమాలకు తెరంగేత్రం చేసింది రష్మికా మందన్న. ఆ తరువాత ఆ సినిమా హీరో రక్షిత్ శెట్టి తో ఆమెకు ఎంగేజ్మెంట్ కాగా.. కొన్ని కారణాల వల్ల వారు మధ్యలోనే బ్రేకప్ చెప్పుకోవాల్సి వచ్చింది.

2 /6

నాగశౌర్య హీరోగా చేసిన ఛలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయమైంది రష్మిక. ఆ తరువాత ఈ హీరోయిన్ నటించిన గీతాగోవిందం చిత్రం ఆమెకు బ్లాక్ బస్టర్ విజయం తెచ్చిపెట్టింది.

3 /6

సినిమాల కన్నా కూడా గీతాగోవిందం హీరో విజయ్ దేవరకొండ తో రష్మిక రిలేషన్ వల్ల ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నాము అని చెప్పకపోయినా రష్మిక వీరిద్దరి ప్రేమ గురించి ఇచ్చే హింట్స్ ఈమెను వార్తల్లో నిలుపుతూ వస్తున్నాయి.

4 /6

ఇక ఈమధ్య అల్లు అర్జున్ తో చేసిన పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా ఇమేజ్ సొంతం చేసుకుంది రష్మిక. అప్పటినుంచి తెలుగులోనే కాకుండా హిందీలో కూడా రష్మికకు ఎన్నో అవకాశాలు రావడం ప్రారంభమయ్యాయి.

5 /6

ఈ మధ్యనే సందీప్ రెడ్డివంగా యానిమల్ సినిమాతో మరో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం పుష్ప రెండో భాగం షూటింగ్ లో బిజీగా ఉంది.

6 /6

తాజాగా ఇన్స్టాగ్రామ్ లో రష్మిక చీరలో షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. తక్కువ మేకప్ తో ఎటువంటి ఆభరణాలు లేకుండా.. రష్మిక ఇచ్చిన ఫోజులు ఆమె అభిమానులను అలరిస్తున్నాయి.