Busy schedule of Rashmika Mandanna:: ప్రముఖ కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఈమధ్య కాలంలో వరుస సినిమాలతో బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈమె గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతున్న ఈ హీరోయిన్..తన తర్వాత సినిమా షూటింగ్ గురించి కూడా ఒక అప్డేట్ తెగ వినిపిస్తోంది.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఛలో సినిమా ద్వారా అడుగుపెట్టిన రష్మిక మందన్న గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో మొదటి సినిమాతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత గీతాగోవిందం సినిమా చేసి ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇందులో విజయ్ దేవరకొండకు జోడీగా నటించిన ఈమె, వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.
అంతేకాదు ఈ జంటకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పుష్ప, పుష్ప2, యానిమల్ వంటి చిత్రాలతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు దక్కించుకుంది. ముఖ్యంగా ఈ చిత్రాలు ఇప్పటికే భారీ కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. ఇదిలా ఉండగా రష్మిక మందన్న ఇటీవల జిమ్ లో గాయపడిన విషయం అందరికీ తెలిసిందే.
సాధారణంగా ఏ హీరోయిన్ అయినా సరే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలి అంటే, అందంతోపాటు శారీరకంగా మరింత అందంగా కనిపించాలి. అందుకే నిత్యం జిమ్ లో కనిపిస్తూ తమ శరీరంలో ఎటువంటి మార్పులు తీసుకురాకుండా పర్ఫెక్ట్ ఫిగర్ మెయింటైన్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి క్రమంలో రష్మిక గాయపడింది. ఈ నేపథ్యంలోనే ఇంటికే పరిమితం అయింది.
ఇటీవల న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో ఆకట్టుకున్న ఈమె, ఇక ఆ తర్వాత జిమ్ లో గాయపడింది. ఇక కొద్ది రోజులుగా రెస్ట్ తీసుకుంటున్న ఈమె, ఇప్పుడు ఇప్పుడే కోలుకొని తిరిగి మళ్ళీ తన తదుపరి చిత్రం షూటింగ్లో పాల్గొనబోతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం రష్మిక లేడీ ఓరియంటెడ్ చిత్రమైన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా షూటింగ్లో తిరిగి జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈమె .. ఇక మరొకవైపు ఈమె కుబేర సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.