IPL 2025 Mega Auction: ఐపీఎల్ 2024 ముగిసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. వచ్చే సీజన్‌కు ప్రారంభానికి ముందు ఈసారి మెగా వేలం నిర్వహించనున్నారు. అన్ని జట్లు కూడా కీలక ఆటగాళ్లను ఉంచుకుని.. ఇతర ప్లేయర్లను జట్టు నుంచి రిలీజ్ చేయనున్నాయి. రాజస్థాన్ రాయల్స్ కీలక ప్లేయర్లను విడుదల చేసే అవకాశం ఉంది.
రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్‌లో ప్లే ఆఫ్స్‌లో వెనుదిరిగింది. ఫస్టాఫ్‌లో అద్భుతంగా ఆడిన రాజస్థాన్ సెకండాఫ్‌లో కాస్త తడబడింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఓడించి.. క్వాలిఫయర్-2లో ఎస్‌ఆర్‌హెచ్ చేతిలో ఓటమిపాలైంది.
2022 మెగా వేలంలో రాజస్థాన్ కీలక ఆటగాళ్లను కొనుగోలు చేసింది. రవిచంద్రన్ అశ్విన్, చాహల్, బౌల్ట్, హెట్‌మెయర్, ర్యాన్ బరాక్‌లను కొనుగోలు చేసింది. సంజూ శాంసన్, జోస్ బట్లర్, యశస్విని జైస్వాల్‌లను రిటైన్ చేసుకుంది.
రవిచంద్రన్ అశ్విన్‌ను రాజస్థాన్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే వేలంలో తిరిగి కొనుగోలు చేసేందుకు ప్రయత్నించవచ్చు.
యుజ్వేంద్ర చాహల్‌ను వదులుకుని ఆర్‌సీబీ పెద్ద తప్పు చేసిందని చాలా మంది ఇప్పటికీ చెబుతున్నారు. రాజస్థాన్ టీమ్ కూడా చాహల్‌ను రిలీజ్ చేసి వేలంలో కొనుగోలు చేసే అవకాశం ఉంది. అయితే వేలంలో భారీ ధర చెల్లించాల్సి రావచ్చు.
ఒక విదేశీ ప్లేయర్‌ను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉండడంతో జోస్ బట్లర్‌ను ఉంచుకుని ట్రెంట్ బౌల్ట్‌ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.
మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ షిమ్రాన్ హెట్‌మెయర్‌ను కూడా రాజస్థాన్ టీమ్ నుంచి విడుదల చేసే అవకాశం ఉంది.
యంగ్ ప్లేయర్ ధృవ్ జురెల్‌ను రాజస్థాన్ టీమ్ నుంచి రిలీజ్ చేసే అవకాశం ఉంది.