Raisins Benefits: మనిషి సంపూర్ణ ఆరోగ్యానికి డ్రై ఫ్రూట్స్ చాలా కీలకం. ఇందులో ముఖ్యమైంది కిస్మిస్. నట్స్‌లో సూపర్‌నట్‌గా చెప్పవచ్చు. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే సరైన సమయంలో తినాల్సి ఉంటుంది. అప్పుడే సంపూర్ణ ప్రయోజనాలు కలుగుతాయి. ఆ వివరాలు మీ కోసం.
అధ్యయనంలో వెలుగు చూసిన వాస్తవం జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం గట్ హెల్త్ ప్రయోజనం ఉంటుంది. నానబెట్టిన కిస్మిస్ అనేది ఒక సహజసిద్ధమైన ల్యాక్సేటివ్‌గా పనిచేస్తుంది. శరీరానికి పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు కూడా లభిస్తాయి.
కిస్మిస్ ఎప్పుడు తినాలి కిస్మిస్ రుచిలో కూడా అద్భుతంగా ఉంటుంది. ఇక పోషకాలైతే లెక్కకు మించి ఉంటాయి. అయితే సరైన సమయంలో సరైన విధానంలో తింటేనే పూర్తి ప్రయోజనాలు కలుగుతాయి.
కిస్మిస్ ప్రయోజనాలు కిస్మిస్‌లో పోలీఫెనోల్, ఫ్లెవనాయిడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నాశనం చేసేందుకు, స్వెల్లింగ్ తగ్గించేందుకు దోహదపడతాయి. సూక్ష్మ క్రిములు వృద్ధి చెందకుండా కాపాడుతాయి. గుండె వ్యాధులు, కేన్సర్ వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుంది.
కిస్మిస్ తినాల్సిన సరైన సమయం కిస్మిస్ తినే సరైన సమయం ఉదయం వేళ. రాత్రంతా నీళ్లలో నానబెట్టి ఉదయం పరగడుపున తీసుకుంటే అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే ఫైబర్ మృదువగా మారి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కిస్మిస్ తినడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు దూరమౌతాయి. అందుకే ఉదయం పూట తింటే మంచిది.
మద్యాహ్నం సమయంలో మద్యాహ్నం వేళ చాలామందికి ఎనర్జీ తక్కువగా ఉండి నీరసంగా అన్పిస్తుంటుంది. ఈ సమయంలో స్వీట్స్ తింటుంటారు. ఈ సమయంలో కిస్మిస్ తినడం అలవాటు చేసుకుంటే చాలా మంచిది. ఇందులో నేచురల్ స్వీట్ ఉంటుంది. ఇందులో ఫ్రక్టోజ్, గ్లూకోజ్ ఉంటాయి.