Washing Clothes: మీ దుస్తులపై మొండి మరకలను సింపుల్‌గా ఇలా తొలగించండి.. ఈ టిప్ పాటిస్తే చాలు..!

Aspirin For Washing Clothes: బట్టలపై మొండి మరకలు పేరుకుపోతే తొలగించడానికి చాలా టైమ్ పడుతుంది. ఒక్కోసారి అవి అలానే ఉండిపోతాయి. ఇక తెల్లని బట్టల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాషింగ్ మెషీన్‌లో పదే పదే ఉతికినా కొత్త బట్టల్లా మెరిసిపోవడం లేదా..? ఏం చేయాలని ఆలోచిస్తున్నారా..? ఈ టిప్ మీ కోసమే..
 

  • Nov 03, 2023, 00:15 AM IST
1 /5

వాషింగ్ మెషీన్లు వచ్చిన తరువాత బట్టలు ఉతికే పని తప్పిపోయింది. అయితే తెల్ల దుస్తులకు సంబంధించి మరకలు తొలగిపోవాలంటే మనం స్వయంగా ఉతుక్కోవాల్సిందే.  

2 /5

అయితే వాషింగ్‌ మెషీన్‌లోనే మీ దుస్తులు మెరిసేలా చేయాలంటే ఆస్పిరిన్‌ మాత్రలను ఉపయోగించండి. ఆస్పిరిన్‌లో ఎసిటైల్‌సాలిసిలిక్ ఆమ్లం ఉంటుంది. ఈ యాసిడ్ బట్టలపై నూనె, పేరుకుపోయిన మరకలను తొలగించేందుకు సాయం చేస్తుంది.   

3 /5

ఆస్పిరిన్ కరిగించడానికి.. వెచ్చని నీటితో పెద్ద గిన్నె లేదా బకెట్ నింపండి. అప్పుడు నీటిలో 5 ఆస్పిరిన్ మాత్రలు వేసి.. అవి పూర్తిగా కరిగిపోయే వరకు వాటిని కదిలించండి. మాత్రలు వేగంగా కరిగిపోవాలనుకుంటే.. వాటిని నీటిలో వేసే ముందు వాటిని పొడి చేయండి.  

4 /5

ఆస్పిరిన్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత.. తెల్లని దుస్తులను ఆస్పిరిన్ నీరు ఉన్న బకెట్‌లోకి వేయండి. అలా వాటిని 8 గంటలు నానబెట్టండి. నానబెట్టడం వల్ల ఆస్పిరిన్ బట్టలపై మరింత ప్రభావవంతంగా పని చేస్తుంది. తరువాత తీసి ఆరేయండి.  

5 /5

రక్తపు మరకలను తొలగించడానికి.. ఆస్పిరిన్‌ను చల్లటి నీటిలో కరిగించి బట్టలను 2 గంటలు నానబెట్టండి. వేడి నీటితో రక్తపు మరకలను తొలగించడానికి ప్రయత్నించవద్దు. ఇది ప్రోటీన్లు గడ్డకట్టడానికి కారణమవుతుంది. ఆ తరువాత మరకను తొలగించడం కష్టతరం చేస్తుంది.