PPF Rules: పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్ మీ పిల్లలు లేదా కుటుంబం అవసరాలు పూర్తి చేసేందుకు అద్భుతమైన పెట్టుబడిగా చెప్పవచ్చు. ప్రభుత్వ ఆధీనంలో నడిచే వ్యవస్థ ఇది. అందుకే ఏ విధమైన రిస్క్ ఉండదు. ఆందోళన అవసరం లేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
PPF Rules: పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ ఎక్కౌంట్‌లో ప్రతి యేటా ప్రభుత్వం 7.1 శాతం లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ కలుపుతుంటుంది. వడ్డీ అనేది ప్రతి సంవత్సరం మారుతుంటుంది. ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ రేట్లను సమీక్షిస్తారు. సెక్షన్ 80 సి కింద ఏడాదికి 1.5 లక్షల వరకూ ట్యాక్స్ మినహాయింపు కూడా పొందవచ్చు. మీ పీపీఎఫ్ ఎక్కౌంట్ యాక్టివ్‌గా ఉందా లేదా క్లోజ్ అయిందా ఓసారి చెక్ చేసుకోండి.
పీపీఎఫ్ ఎక్కౌంట్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌పై ఏడాదికి లభించే వడ్డీ, మెచ్యూరిటీ ఎమౌంట్ రెండింట్లో ట్యాక్య్ మినహాయింపు ఉంటుంది. కానీ కొన్ని నియమ నిబంధనలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.
ఒకవేళ మీరు ఏడాదికి 500 కూడా జమ చేయలేకపోతే మీ పీపీఎఫ్ ఎక్కౌంట్ ఇనాక్టివ్ అయిపోతుంది.
పీపీఎఫ్ ఎక్కౌంట్‌లో కనీస మొత్తం జమ కాకపోతే నష్టం ఎదురౌతుంది. పీపీఎఫ్ ఎక్కౌంట్‌పై లోన్ తీసుకోవడం కష్టమౌతుంది. జరిమానా కూడా చెల్లించాల్సి ఉంటుంది.
పీపీఎఫ్ ఎక్కౌంట్‌లో ప్రతి యేటా డబ్బులు తప్పకుండా జమ చేయాల్సి ఉంటుంది. ఏదైనా కారణంతో డబ్బులు జమ కాకపోతే జమ చేసి తిరిగి యాక్టివ్ చేసుకోవాలి. క్లోజ్ అయిన పీపీఎఫ్ ఎక్కౌంట్ యాక్టివ్ చేసేందుకు లిఖిత పూర్వకంగా దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది.
పీపీఎఫ్ ఎక్కౌంట్ యాక్టివ్ కావాలంటే ఎంతకాలం క్లోజ్ చేసుందో అంతకాలం ఏడాదికి 500 రూపాయల చొప్పున డిపాజిట్ చేయాలి. దాంతోపాటు ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం కోసం 500 లేదా అంతకంటే ఎక్కువ జమ చేయాల్సి ఉంటుంది.