డార్లింగ్ ప్రభాస్ మనసు వెన్నలాంటిది అని అతనితో కాస్త సమయం వెచ్చించిన ఎవరికైనా తెలుస్తుంది. నేచర్ లవర్ అయిన ప్రభాస్ తాజాగా తన మనసు చాటుకున్నాడు. ఏకంగా అడవి భూమినే దత్తత తీసుకున్నాడు. హైదరాబాద్ కు సమీపంలో ఉన్న కాజీపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో 1,650 ఎకరాల ఆటవీ భూమిని అడాప్ట్ చేసుకున్నాడు.
తన తండ్రి ఉప్పలపాటి సూర్య నారాయణరాజు పేరిట ఈ భూమిని దత్తత తీసుకున్నాడు. ఇకపై ప్రభాస్ తను దత్తత తీసుకున్న 1,650 ఎకరాల ఆటవి భూమిని కంటికి రెప్పలా కాపాడుతూ డెవలెప్ చేస్తానంటున్నాడు.
రాజ్యసభ సభ్యుడు జే సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన ప్రభాస్ అడవి భూమిని అడాప్ట్ చేసుకున్నాడు.
అడవి సంరక్షించడానికి ప్రభాస్ తొలిగా రూ.2 కోట్లు సాయం అందించారు. మరింత సహాయం చేయడానికి సిద్ధం అయ్యారు.