Ponnaganti Kura: పాలకూర, గోంగూర వంటి ఆకుకూరల్లో పొన్నగంటి కూర కూడా ఒకటి. దీన్ని చెన్నగంటి కూర అని కూడా పిలుస్తారు.ఆయుర్వేదం పోయిన కంటి కూర అని పిలుస్తారు. ఎందుకంటే ఈ ఆకుకూర తింటే పోయిన చూపు కూడా తిరిగి వస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. పొన్నగంటి కూర తింటే ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చో తెలుసుకుందాం.
Health Benefits of Ponnaganti Kura: పొన్నగంటి కూరలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని పప్పులో కానీ వట్టిగా కానీ వేయించి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు పొన్నగంటి కూరను డైట్లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తరుచుగా తీసుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.
పొన్నగంటి కూరను ఎలా తిన్నా అందులోని ప్రయోజనాలన్నీ పొందవచ్చు. ఈ కూరను తరచుగా డైట్లో చేర్చుకుంటే కాళ్లనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఈ అకులను పొడి చేసుకుని కూడా తినవచ్చు. శరీరంలో వేడిని తగ్గించడంతోపాటు తలనొప్పిని తగ్గిస్తుంది. దీన్ని ఎక్కువగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.
పొన్నగంటి కూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. రక్తం తక్కువగా ఉన్నవారు ఈ ఆకు కూరను ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
షుగర్ వ్యాధిగ్రస్తులు పొన్నగంటి కూరను తింటే వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ డయాబెటిక్ లక్షణాలు షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తాయి.
పొన్నగంటి కూర ఆకురసంను ముఖానికి రాస్తే మొటిమలు, మొటిమల తాలుకూ మచ్చలు మాయమవుతాయి. చర్మం మెరుస్తుంది. వారానికి రెండుసార్లు ఈ కూరను ఆహారంలో చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
పొన్నగంటి కూర కంటికి ఎంతో మేలు చేస్తుంది. ఈ ఆకుకూరలో ఉండే పోషకాలు, ఖనిజాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇందులో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అందుకే ఆయుర్వేద వైద్యులు పొన్నగంటి కూరను పోయిన కంటి కూర అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఈ కూరను తింటే నిజంగానే కంటి చూపు వస్తుందని చెబుతున్నారు.
ఇక ఈ కూర ఆకుల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మెరుగుపరచడంలో సహాయపడుతుంది.