Poco X7 Price: ఫ్లిఫ్‌కార్ట్‌లో Poco X7 సిరీస్ మొదటి సేల్‌.. ఆఫర్స్‌తో డెడ్ చీప్‌ ధరకే పొందండి..

Poco X7 Price In India: మార్కెట్లోకి పోకోకు సంబంధించిన కొత్త సిరీస్ మొబైల్ విడుదలైంది. ఇది అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే దీనికి సంబంధించిన మొదటి సేల్ ఈరోజు ప్రారంభమైంది. ఈ మొబైల్ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
 

1 /5

ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ MediaTek చిప్‌సెట్‌తో విడుదలైంది. అంతేకాకుండా 1.5K AMOLED డిస్‌ప్లే సెటప్‌తో అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. అలాగే ఈ మొబైల్ బ్యాక్ సెట్ అప్ లో త్రిబుల్ కెమెరా సెటప్ కెమెరా సిస్టంతో అందుబాటులోకి వచ్చింది.   

2 /5

ఈ Poco X7 స్మార్ట్ ఫోన్ సిరీస్ నేటి నుంచి Flipkartలో అందుబాటులోకి రాబోతోంది. అయితే దీనికి సంబంధించిన మొదటి సేల్లో భాగంగా కొనుగోలు చేసే వారికి బంపర్ ఆఫర్ లభించబోతోంది. ముఖ్యంగా దీనిని ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అండ్ వినియోగించి పేమెంట్ చేసే వారికి తక్షణ రూ.2,000 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది.  

3 /5

ఇక ఈ  Poco X7 స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్ స్పెసిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే.. ఈ మొబైల్ డిస్ప్లే 6.67-అంగుళాల 1.5K OLEDతో లభిస్తోంది. అంతేకాకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో విడుదలైంది. అలాగే ప్రత్యేకమైన 3000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది.    

4 /5

 ఇక ఈ మొబైల్‌కు సంబంధించిన ప్రాసెసర్ చూస్తే.. ఇది మోస్ట్ పవర్ఫుల్ MediaTek Dimensity 7300 Ultra 4nm ప్రాసెసర్ పై పనిచేయబోతోంది. దీని ద్వారా మల్టీ టాస్కింగ్ కూడా ఎంతో సులభంగా చేయవచ్చు. అంతేకాకుండా నాలుగు సంవత్సరాల ప్యాచ్ సెక్యూరిటీని కూడా అందిస్తోంది.     

5 /5

ఇక ఈ  Poco X7 మొబైల్ వెనక భాగంలో.. త్రిబుల్ కెమెరా సెట్ అప్ ను కలిగి ఉంటుంది. ఇందులోని ప్రధాన కెమెరా  50MP Sony LYT-600 సెన్సార్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఫ్రంట్ కెమెరా 20MP ను కలిగి ఉంటుంది. కాబట్టి సులభంగా వీడియో కాల్స్, జూమ్ మీటింగ్స్ చేసుకోవచ్చు. ఇది అతి శక్తివంతమైన 5500mAh బ్యాటరీతో విడుదలైంది.