Phillip Hughes Death: క్రికెట్ ఆడుతూ మైదానంలో మరణించిన ఆటగాళ్లు వీరే..

Cricketers Died While Playing Cricket: క్రికెట్ ఆడితే ఎంత మజా వస్తుందో.. ఆటగాళ్లకు అదేస్థాయిలో గాయాలు కూడా అవుతుంటాయి. ఒక్కొసారి బంతి బలంగా తాకితే ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. ఆస్ట్రేలియన్ బ్యాట్స్‌మెన్ ఫిలిప్ హ్యూస్ 27 నవంబర్ 2014న మ్యాచ్ సందర్భంగా తలకు బౌన్సర్ తగిలి మరణించిన విషయం తెలిసిందే. సిడ్నీలో సౌత్ ఆస్ట్రేలియా, న్యూ సౌత్ వేల్స్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. క్రికెట్ ఆడుతూ.. ప్రపంచానికి వీడ్కోలు పలికిన మరో ఐదుగురు ఆటగాళ్లు ఉన్నారు.  

  • Nov 27, 2022, 11:15 AM IST
1 /6

ఫిలిప్ హ్యూస్ బౌలర్ షాన్ అబాట్ వేసిన బౌన్సర్‌ హ్యూస్ తలకు నేరుగా తాకింది. ఆ తర్వాత హ్యూస్ తడబడుతూ నేలపై పడిపోయాడు. హ్యూస్ మూడు రోజులు కోమాలో ఉండి.. నవంబర్ 27న మరణించాడు. అప్పుడు ఫిలిప్ హ్యూస్ వయసు కేవలం 26 ఏళ్లు.  

2 /6

2021 మే 6న ఇంగ్లండ్‌లో కూడా ఒక విషాద సంఘటన జరిగింది. నెట్ ప్రాక్టీస్ సమయంలో 24 ఏళ్ల క్రికెటర్ జాషువా డౌనీ అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. అతను ఒలింపిక్ జిమ్నాస్ట్‌లు బెకీ డౌనీ, ఎల్లీ డౌనీ సోదరుడు.   

3 /6

భారత క్రికెట్ జట్టు ఆటగాడు రమణ్ లాంబా ఒక మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా.. బంతి అతని తలకు తగిలడంతో అక్కడిక్కడే స్పృహతప్పి పడిపోయాడు. ఆ తర్వాత అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మరణించే నాటికి అతని వయస్సు 38 సంవత్సరాలు.  

4 /6

ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ బ్యూమాంట్ 2012లో ప్లేగ్రౌండ్‌లో గుండెపోటుతో మరణించాడు. అప్పటికి అతని వయసు 33 ఏళ్లు మాత్రమే.  

5 /6

పాకిస్థాన్ క్రికెటర్ జుల్ఫికర్ భట్టి కేవలం 22 ఏళ్ల వయసులో ప్రమాదానికి గురయ్యాడు. అతను దేశవాళీ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతని ఛాతీపై బంతి తగలడంతో అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. జుల్పికర్‌ను పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు తెలిపారు.  

6 /6

2021 ఫిబ్రవరి 17న పూణేలో ఒక మ్యాచ్ ఆడుతున్నప్పుడు బాబు నలవాడే అనే ఆటగాడు గుండెపోటుతో హఠాత్తుగా మరణించాడు. వెంటనే సమీపంలోని వైద్యులకు తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.