Rajasthan Forts: రాజస్థాన్‌లో అందమైన ఆ ఐదు నగరాలు కేవలం 5 వేలలోనే..

రాజస్థాన్..దేశంలో చారిత్రాత్మక ప్రాంతం. అత్యధికంగా కోటలున్న రాష్ట్రమిదే. రాజస్థాన్ పేరు వినగానే ఒంటెలు, ఎడారి దర్శనమిస్తాయి. రాష్ట్రంలోని చారిత్రాత్మక ప్రాంతాల్ని కోటల్ని పర్యటించేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఢిల్లీ నుంచి బయలుదేరితే..కేవలం 5 వేల రూపాయల్లో 5 నగరాల్ని చుట్టవచ్చు..అవేంటో తెలుసుకుందాం.

Rajasthan Forts: రాజస్థాన్..దేశంలో చారిత్రాత్మక ప్రాంతం. అత్యధికంగా కోటలున్న రాష్ట్రమిదే. రాజస్థాన్ పేరు వినగానే ఒంటెలు, ఎడారి దర్శనమిస్తాయి. రాష్ట్రంలోని చారిత్రాత్మక ప్రాంతాల్ని కోటల్ని పర్యటించేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ఢిల్లీ నుంచి బయలుదేరితే..కేవలం 5 వేల రూపాయల్లో 5 నగరాల్ని చుట్టవచ్చు..అవేంటో తెలుసుకుందాం.
 

1 /5

రాజసమంద్  రాజసమంద్ జిల్లాలోని యునెస్కో హెరిటేజ్ సైట్‌గా గుర్తింపు దక్కించుకుంది కుంభల్‌గఢ్ ఫోర్ట్. ఇక్కడికి పెద్ద సంఖ్య పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఇక్కడి అందాలు పర్యాటకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి.

2 /5

జయపూర్ ఇది రాజస్థాన్ రాజధాని నగరం. దీన్ని పింక్ సిటీ అని కూడా పిలుస్తారు. ఎక్కువగా ఇళ్లు ఈ నగరంలో పింక్ కలర్‌లోనే ఉంటాయి. ఈ నగరంలో ఆల్బర్ట్ హాల్, జల్ మహల్, హవా మహల్, జయగడ్ ఫోర్ట్, ఆమేర్ కోట వంటివి ఉన్నాయి.

3 /5

చిత్తౌడ్‌గఢ్ ఇందులో మీరు చిత్తౌడ్‌గఢ్ ఫోటో చూడవచ్చు. ఇది ఏకంగా 7 వందల ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని చరిత్రకు మద్యకాలం నాటి రక్తం చిందిన గోడలే సాక్ష్యం. బలిదానానికి , సాహసానికి ఈ కోట ప్రతీక. 

4 /5

జోధ్‌పూర్ రాజస్థాన్‌లో జోధ్‌పూర్ మరో ప్రాంతం. ఇక్కడి లక్షలాది సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడ ప్రాచీన కోటలు, చారిత్రాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో ఉమ్మేద్ భవన్, మెహ్రాన్‌గఢ్ ఫోర్ట్, మండోర్ గార్డెన్ ఉన్నాయి.

5 /5

ఉదయపూర్ ఉదయపూర్ నగరం సరస్సుల నగరం. ఇది దేశంలోని మోస్ట్ రొమాంటి ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ పెద్ద సంఖ్యలో జంటలు వస్తుంటారు. ఇక్కడ ప్రాచీన కోటలున్నాయి. ఇందులో సిటీ ప్యాలేస్, మహారాణా ప్రతాప్ మెమోరియల్, జగ్‌మందిర్, ఫతేహ్ సాగర్ సరస్సు, పిఛౌలా సరస్సు వంటివి ఉన్నాయి.