Pitru Paksha 2024: పితృ పక్షంలో అద్భుతం.. జాక్ పాట్ కొట్ట బోతున్న రాశులు ఇవే.. మీరున్నారా..?

Pitru Paksha effect: పితృ పక్షాలు అనేది పదిహేను రోజుల పాటు నిర్వహిస్తారు.ఈ పదిహేను రోజుల్లో చనిపోయిన మన ఇంటివారు, పూర్వీకులు తిరిగి ఈ భూమిమీదకు వస్తారని చెబుతుంటారు. అందుకే ఈ పదిహేనురోజుల్లో చాలా మంది చనిపోయిన పూర్వీకుల కోసం అనేక కార్యక్రమాలు చేస్తుంటారు.
 

1 /7

మహాలయ పక్షంలనే.. పితృ పక్షాలు అని కూడా పిలుస్తుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఈ పక్షం రోజులను పెత్తర అమాస అని కూడా చెబుతుంటారు.  పితృ పక్షాలు ఈనెల సెప్టెంబర్ 18 న ప్రారంభమై అక్టోబర్ 2 వ తేదీ మహాలయ అమావాస్యతో ముగుస్తాయి.  

2 /7

ఈ పదిహేను రోజుల పాటు మనం చేసే శ్రాద్ధకర్మాది కార్యక్రమాలను.. పితృదేవతలు స్వీకరిస్తారని చెబుతుంటారు. అందుకే తమ పూర్వీకుల కోసం కొంత మంది గంగా, గోదావరి పరివాహాక ప్రాంతాలలో వెళ్లి పితృ సంబంధ కార్యక్రమాలు చేస్తుంటారు. మరికొందరు తమ ఇంట్లోనే శ్రాద్ధాదికాలు నిర్వహిస్తారు.  

3 /7

ముఖ్యంగా పూర్వీకుల అనుగ్రహాం కోసం పితృ సంబంధ కార్యక్రమాలు చేసేవారి ఇంట్లో కనక వర్షం కురుస్తుందని చెప్పుకొవచ్చు. ముఖ్యంగా ఈ పదిహేను రోజుల పాటు కోన్నిరాశుల వారికి వారి పూర్వీకులు ఊహించని ధనలాభం, జీవితంలో ఉన్నతిని ఇవ్వబోతున్నారు. ఆ రాశులు ఏంటో ఇప్పుడు చూద్దాం..  

4 /7

మేశం.. ఈ రాశివారికి ముఖ్యంగా గ్రహాలు అన్ని ఉచ్చస్థితిలో ఉండటం వల్ల.. పితృ పక్షాల సమయం వీరికి యోగ్యంగా ఉంటుందని చెప్పుకొవచ్చు. ఇప్పటి వరకు ఆగిపోయిన పనులన్ని పూర్తవుతాయి. రాదనుకుని వదిలేసిన డబ్బులు చేతికి అందుతాయి. అంతేకాకుండా.. విదేశీయానానికి కూడా అవకాశం ఉంది.   

5 /7

మిథునం.. ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది. నూతన వాహాన యోగంతో పాటు కొత్త ఇల్లు కొనుగోలు చేస్తారు. స్నేహితులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. దగ్గరి బంధువులతో బిజినెస్ లు చేస్తారు.  

6 /7

కర్కాటకం..ఈ రాశివారికి.. పితృ పక్షాల యోగం ఎంతో లాభిస్తుందని చెప్పుకొవచ్చు. పూర్వీకులు ఇప్పటి వరకు వీళ్ల మీద చూపించిన కోపం కాస్త అనుగ్రహాంగా మారుతుంది. లాటరీలు తగిలే అవకాశం ఉందని చెప్పుకొవచ్చు. స్నేహితులతో సఖ్యత ఏర్పడుతుంది.

7 /7

మీనం..ఈ రాశివారికి కూడా పితృ పక్షాలల్లో అనుకోని విధంగా ధనలాభం కల్గజేస్తుంది. రుణ సంబంధ సమస్యల నుంచి బైటపడతారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.  ఉద్యోగంలో ప్రమోషన్ లు లభించే అవకాశం ఉంది. తండ్రి వైపు  నుంచి రాదనుకున్న ఆస్తులు మరల మీ సొంతమవుతాయి.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)