Pitru paksha 2024: పితృపక్ష ప్రారంభం రేపే.. ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి..!

Pitru paksha 2024 date: ప్రతి సంవత్సరం ఒక 15 రోజులపాటు పితృపక్షం ఏర్పడుతుందన్న విషయం తెలిసిందే. పక్షం అంటే 15 రోజులు.. ఈ పితృపక్షం అంటే పితురులకు ప్రత్యేకం.. ఈ సమయంలో చనిపోయిన పెద్దలకు శ్రాద్ధం , తర్పణం చేస్తారు. ప్రతి ఏడాది వచ్చే ఈ పితృపక్షం  ఈ కార్యక్రమాలకు అంకితం చేయబడింది.  ఈ ఏడాది పితృపక్షం అంటే రేపు సెప్టెంబర్ 18వ తేదీ బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సమయంలో ప్రత్యేకించి మగవారు కొన్ని పొరపాట్లను అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. 

1 /6

ఈ ఏడాది సెప్టెంబర్ 18వ తేదీ నుంచి పితృపక్షం మొదలవుతుంది. కాబట్టి ఈ 15 రోజులపాటు పితృదేవులకు పిండ ప్రధానం చేయవచ్చు. అక్టోబర్ రెండవ తేదీ మహాలయ అమావాస్యతో ఈ పితృపక్షం ముగుస్తుంది. 

2 /6

పితృదేవతల ఆశీర్వాదం ఉంటే వంశాభివృద్ధి , జీవితంలో ఇతర ఆటంకాలు ఎదురవకుండా ఉంటాయని పెద్దలు విశ్వసిస్తారు . అందుకే వారిని శాంతింప  చేయడానికి ఈ పితృపక్ష సమయంలో కాకులకు పిండం , బ్రాహ్మణులకు భోజనాలు, వస్త్రదానం, శ్రాద్ధ కర్మలు లాంటివి నిర్వహిస్తారు.

3 /6

ప్రతి ఏడాది భాద్రపద శుక్లపక్ష పౌర్ణమి రోజు ప్రారంభమై.. ఆశ్వీయుజ మాసం కృష్ణ పక్షం అమావాస్యతో పితృపక్షం పూర్తవుతుంది. అయితే ఈ పితృపక్షంలో ప్రత్యేకించి మగవారు కొన్ని పనులు చేయకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు. 

4 /6

ముఖ్యంగా పితృపక్షంలో మగవారు ఆహారంలో ఉల్లి,  వెల్లుల్లిని అసలు తినకూడదు. ఈ సమయంలో ఎటువంటి దానాలు చేసినా సరే పితృదేవుల ఆశీర్వాదం లభిస్తుంది. ఈ సమయంలో ఉదయాన్నే లేచి స్నానాలు నిర్వహించి,  పూజలు నిర్వహించాలి. ముఖ్యంగా మహిళలు రుతుక్రమంలో ఉంటే పితృపక్షంలో పితృదేవుళ్ళ కోసం ఆహారం వండకూడదు. ఈ పనులన్నీ కూడా మగవారే చేసుకోవాలి. 

5 /6

మద్యం, మాంసానికి దూరంగా ఉండాలి. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. పితృపక్షం అంటే పీడ దినాలుగా పరిగణిస్తారు. కాబట్టి కొత్త పనులు ఏవి కూడా ప్రారంభించకూడదు. కారు , ఇల్లు వంటివి కొనుగోలు చేయరాదు. అలాగే గృహోపకరణాలు,  శుభకార్యాలు వంటివి చేపట్టరాదు. 

6 /6

మగవారి విషయానికి వస్తే జుట్టు కత్తిరించుకోవడం,  షేవింగ్,  గోళ్ళు కత్తిరించుకోవడం లాంటివి చేయరాదు.  కొత్త దుస్తులు కూడా కొనుగోలు చేయరాదు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే పితృదేవుల ఆశీర్వాదం లభిస్తుందని సమాచారం.