NPS New Rule: ఉద్యోగులకు బిగ్‌ అప్‌డేట్.. NPS కొత్త రూల్.. పెన్షన్‌లో 40 శాతం పెంపు..!

National Pension System Calculation: పాత పెన్షన్‌ విధానంలో తీసుకువచ్చిన జాతీయ పెన్షన్ వ్యవస్థలో కీలక మార్పులు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగులకు ఎక్కువ ప్రయోజనాలు కలిగించే దిశగా ఆలోచనలు చేస్తోంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ను తీసుకురావాలని ఉద్యోగులు డిమాండ్ చేసినా.. సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎన్‌పీఎస్‌లోనే మార్పులు చేసి మరింత లబ్ధి చేకూర్చే దిశగా ఆలోచిస్తోంది. గత నెలలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఎన్‌పీఎస్‌ (NPS) నిబంధనలలో మార్పులు చేసిన విషయం తెలిసిందే. 
 

1 /9

ఉద్యోగం చేస్తున్న ప్రతి ఉద్యోగి.. రిటైర్‌మెంట్ తరువాత ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవించాలని కోరుకుంటారు. అందుకే ముందు నుంచే వివిధ స్కీమ్స్‌లో డబ్బును ఇన్వెస్ట్ చేస్తారు. వీటిలో నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. పాత పెన్షన్ విధానం స్థానంలో ఈ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది.  

2 /9

అయితే ఉద్యోగుల నుంచి వ్యతిరేకత రావడంతో ఎన్‌పీఎస్‌లో కీలక మార్పులకు శ్రీకారం చూట్టింది. దీంతో ఈ స్కీమ్‌ కింద గతంలో కంటే మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు.  

3 /9

తాజా మార్పులతో ఉద్యోగుల బేసిక్‌పేలో 14 శాతం ఎన్‌పీఎస్‌ కంట్రిబ్యూషన్‌కు చెల్లించాలి. గతంలో ఇది 10 శాతంగా ఉండేది. దీంతో చేతికి వచ్చే జీతం కాస్త తగ్గినా.. పెన్షన్ పరంగా మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.  

4 /9

ఉదాహరణకు ఓ ఉద్యోగికి 30 ఏళ్ల వయస్సులో బేసిక్ పే రూ.35 వేలు అనుకుందాం. ప్రతి నెలా 14 శాతం చొప్పున రూ.4,900 ఎన్‌పీఎస్‌కి జమ చేయాల్సి ఉంటుంది. ఇలా ఆ ఉద్యోగి 60 సంవత్సరాల వయస్సు వరకు అంటే 30 సంవత్సరాల వరకు ఇలా జమ చేయాలి.    

5 /9

40 శాతం ఎన్‌పీఎస్‌ కంట్రిబ్యూషన్ గణన: NPS= ఖాతా తెరిచే వయస్సు 30, బేసిక్ పే– రూ.35 వేలు, ప్రాథమిక జీతంలో 14 శాతం–రూ. 4900, ప్రతి నెల NPSలో పెట్టుబడి – రూ.4900, అంచనా వేసిన పెట్టుబడి ఆదాయం – సంవత్సరానికి 10 శాతం, మొత్తం పెట్టుబడి 30 సంవత్సరాలలో – రూ.17,64,000, 30 సంవత్సరాల తర్వాత మొత్తం ఫండ్- రూ.1,11,68,695, వార్షిక మొత్తం (యాన్యుటీ)- 40 శాతం, యాన్యుటీపై అంచనా వేసిన ఆదాయం- సంవత్సరానికి 8 శాతం, 60 ఏళ్ల వయస్సుకు ప్రతి నెలా రూ.29,783 పెన్షన్ అందుకునే అవకాశం ఉంటుంది.  

6 /9

10 శాతం ఎన్‌పీఎస్‌కు కంట్రీబ్యూషన్ లెక్కలు ఇలా..: NPSలో ఖాతా తెరిచే వయస్సు – 30, బేసిక్ పే– రూ.40 వేలు అనుకుంటే.. ప్రాథమిక జీతంలో 10 శాతం అంటే 4 వేలు, NPSలో నెలవారీ పెట్టుబడి – 4 వేలు, అంచనా వేసిన పెట్టుబడి రాబడి – సంవత్సరానికి 10 శాతం, మొత్తం పెట్టుబడి 30 ఏళ్లు– రూ.14,40,000, 30 సంవత్సరాల తర్వాత మొత్తం ఫండ్ - 91,17,302, వార్షిక మొత్తం (యాన్యుటీ)- 40 శాతం, యాన్యుటీపై అంచనా వేసిన ఆదాయం- సంవత్సరానికి 8 శాతం, 60 ఏళ్ల వయస్సు తరువాత ప్రతి నెలా పెన్షన్- రూ.24,313.  

7 /9

ఎన్‌పీఎస్‌లో ప్రవేశపెట్టిన కొత్త నిబంధన అమలు చేస్తే.. ఉద్యోగులకు పదవీ విరమణ తరువాత అధిక పెన్షన్ వస్తుంది. అంటే పెన్షన్‌లో దాదాపు 40 శాతం పెరుగుదల ఉంటుంది.   

8 /9

ఎన్‌పీఎస్‌లో 18 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వారు అకౌంట్‌ను ఓపెన్ చేసుకోవచ్చు.  

9 /9

నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఆదాయం ఇప్పటివరకు 8 శాతం నుంచి 12 శాతం వరకు ఉంది. పదవీ విరమణ తరువాత లైఫ్‌ ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాగిపోవాలంటే ఎన్‌పీఎస్ బెస్ట్ ఆప్షన్‌ అని నిపుణులు చెబుతున్నారు.