Not Only India Worlds Highest Cricketer Is Aryaman Birla You Know His Wealth: భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ కన్నా అత్యంత సంపన్న క్రికెటర్ ఒకరు ఉన్నారు. భారత్‌లో అత్యంత సంపన్న క్రికెటర్‌గా సీనియర్లను కాదని రాణిస్తున్న యువ క్రికెటర్ ఎవరో తెలుసా? అతడి ఆస్తి ఎంతో తెలిస్తే షాక్ అవుతారు.
Aryaman Birla: సంపాదనలో విరాట్ కోహ్లీ, ధోనీని కాదని భారత్‌లో అత్యంత సంపన్న క్రికెటర్ ఒకరు ఉన్నారు. అతడి ఆస్తి కొన్ని కోట్లలో ఉంది.
Aryaman Birla: క్రికెట్‌లో ప్రతిభ చాటినకొద్ది ఆటగాళ్ల సంపద పెరుగుతుంది. ఇప్పుడు దాదాపు ప్రతి క్రికెటర్ కోటి రూపాయలలో పారితోషికం పొందుతున్నాడు. విదేశీ క్రికెటర్ల కంటే భారత క్రికెటర్లు ఎక్కువ సంపాదిస్తున్నారు.
Aryaman Birla: ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా భారత క్రికెట్ నియంత్రణ బోర్డ్ (బీసీసీఐ) అవతరించింది. క్రికెటర్‌లలో విరాట్ కోహ్లీ, ధోనీ అత్యధిక ధనవంతులు అని అందరూ భావిస్తున్నారు.
Aryaman Birla: ధోని, కోహ్లీ కన్నా అత్యధిక ఆదాయం కలిగిన క్రికెటర్ ఆర్యమాన్ బిర్లా. ఇతడు ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కుమారుడు. ఇతడు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెటర్‌గా ఆర్యమన్ బిర్లా నిలుస్తున్నాడు.
Aryaman Birla: దేశంలోనే అత్యంత సంపన్న వ్యాపారవేత్తలలో కుమార్ మంగళం బిర్లా ఒకరు. అతడి కుమారుడు ఆర్యమాన్ బిర్లా వ్యాపారంతో పాటు క్రికెట్‌లో రాణిస్తున్నాడు.
Aryaman Birla: 2017లో క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఆర్యమాన్ బిర్లా మధ్యప్రదేశ్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెటర్‌గా నిలిచాడు. అయితే 2019లో అనూహ్యంగా క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
Aryaman Birla: తన 22 ఏళ్ల వయసులోనే ఆర్యమాన్ బిర్లా క్రికెట్ నుంచి విరామం తీసుకోవడం గమనార్హం. అయితే మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా క్రికెట్‌కు వీడ్కోలు పలికినట్లు సమాచారం.
Aryaman Birla: ఆర్యమాన్ బిర్లా ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో 16 ఇన్నింగ్స్‌లు ఆడాడు. 27.60 సగటుతో 414 పరుగులు చేశాడు.
Aryaman Birla: క్రికెట్ వర్గాల సమాచారం ప్రకారం ఆర్యమాన్ బిర్లాకు దాదాపు రూ. 70,000 కోట్ల ఆస్తులు ఉండవచ్చు. అంతేకాకుండా అతడి కార్లు, వాచీలు వంటివి కలిపితే 80 వేల కోట్లపైన ఉంటాయని సమాచారం.