Nokdo Island: దక్షిణ కొరియాలోని నోక్డో ఐల్యాండ్‌లో చిన్నారులు ముగ్గురే ముగ్గురున్నారట..నమ్మలేకున్నారా

బ్యాంక్ ఆఫ్ కొరియా రిపోర్ట్ ప్రకారం దక్షిణ కొరియా దేశం 2045 నాటికి జపాన్‌ను దాటి ముందుకు పోతుందట. ప్రపంచంలో ఎక్కువ వృద్ధులు ఉన్న దేశంగా మారనుందట. ఆ ఐల్యాండ్‌లో కూడా ఇదే పరిస్థితి. అక్కడైతే కేవలం ముగ్గురే ముగ్గురు చిన్నారులున్నారట

Nokdo Island: బ్యాంక్ ఆఫ్ కొరియా రిపోర్ట్ ప్రకారం దక్షిణ కొరియా దేశం 2045 నాటికి జపాన్‌ను దాటి ముందుకు పోతుందట. ప్రపంచంలో ఎక్కువ వృద్ధులు ఉన్న దేశంగా మారనుందట. ఆ ఐల్యాండ్‌లో కూడా ఇదే పరిస్థితి. అక్కడైతే కేవలం ముగ్గురే ముగ్గురు చిన్నారులున్నారట

1 /7

బ్యాంక్ ఆఫ్ కొరియా రిపోర్ట్ ప్రకారం 2045 వరకూ దక్షిణ కొరియా జపాన్‌ను వెనక్కి నెట్టి ముందుకు వెళ్లిపోతుందట. ప్రపంచంలో వృద్ధ జనాభా ఎక్కువ ఉన్న దేశంగా మారిపోతుందట. పుట్టుక శాతం తగ్గించాలని ఆదేశాలున్నాయి కానీ..ఇదైతే మరీ ఊహించనంత వేగంగా తగ్గిపోయిందట.

2 /7

ప్రపంచ బ్యాంకు రిపోర్ట్ ప్రకారం దక్షిణ కొరియాలో పుట్టుక శాతం 0.84 మాత్రమే. ఇది 1975లో 4.5 శాతంగా ఉంది. కానీ 1970 దశాబ్దంలో దేశ ఆర్ధిక వ్యవస్థలో మార్పు వచ్చినప్పుడు శ్యాంసంగ్, హ్యుండాయ్ వంటి కంపెనీలు ఇక్కడి మహిళలకు పెద్దఎత్తున ఉద్యోగాలు కల్పించినప్పుడు..కుటుంబ నియంత్రణ కార్యక్రమంపై అవగాహన పెరిగింది. దాంతో దేశ రాజధాని సియోల్ మెట్రోపాలిటన్ ప్రాంతంలో ఉండే 51 మిలియన్ల జనాభాపై విమర్శలు వచ్చి పడ్డాయి. వీరి కారణంగానే దేశంలో పిల్లలు తక్కువైపోయారని..

3 /7

నోక్డో ఐల్యాండ్ ఒకప్పుడు సమృద్ధిగా కళకళలాడుతుండేది. కానీ 1970-80 దశాబ్దంలో దక్షిణ కొరియాలో కుటుంబ నియంత్రణ కార్యక్రమం గట్టిగా అమలు చేశారు. దేశంలో నగరీకరణ వేగంగా పెరిగింది. దాంతో దేశంలోని పిల్లలు పుట్టడమనే ప్రక్రియ మందగించింది. పరిస్థితి ఎంతవరకూ వెళ్లిందంటే 2020లో అత్యంత తక్కువ మందికి జన్మనిచ్చిన దేశంగా మిగిలిపోయింది.

4 /7

ఈ ముగ్గురిలో చాన్ పెద్దవాడు. అతడి తండ్రి వయస్సు 42 ఏళ్లు. ఈ ఐల్యాండ్‌లో తక్కువ వయస్సున్నవారిలో ఒకడతను.  ఫాదర్ ఉద్యోగం ఉన్నంతవరకే తానిక్కడ ఉంటానని తరువాత వెళ్లిపోతానంటున్నాడు. ఈ ఐల్యాండ్ చాలా అందంగా ఉంటుందని కానీ పిల్లలకు ఇక్కడ భవిష్యత్ లేదని చెబుతున్నాడు. 

5 /7

అసలు ఈ ముగ్గురు పిల్లలు కూడా ఈ ద్వీపానికి చెందినవారు కారు. ఐల్యాండ్‌లోని ఒకే ఒక చర్చ్ ఫాదర్ పిల్లలు వీరు. వీళ్లు 2016 నుంచి ఇక్కడ ఉంటున్నారు. అంటే ఈ ముగ్గురు రాకముందు అసలీ ద్వీపంలో పిల్లలే లేరన్నమాట.

6 /7

దక్షిణ కొరియా 2020లో మొత్తం ప్రపంచంలో తక్కువ మంది పుట్టిన దేశంగా ఖ్యాతి గాంచింది. ఇదే దేశానికి చెందిన నోక్డో  ఐల్యాండ్‌లో ఉండే ఈ ముగ్గురు పిల్ల కధ అందర్నీ ఆకర్షిస్తుంటుంది. వాస్తవానికి ఈ ముగ్గురు పిల్లలకు ఆడుకునేందుకు ఇక్కడ చాలా సువిశాల స్థలమే ఉంది. ట్రాఫిక్ సమస్య కూడా లేదిక్కడ. కానీ ఈ ముగ్గురూ తప్ప ఆడుకునేందుకు మరెవరూ లేరు.

7 /7

దక్షిణ కొరియాలోని ఒక ఐల్యాండ్‌పై కేవలం ముగ్గురే చిన్నారులున్నారు. ఈ ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందినవారు. వీళ్లు కాకుండా దాదాపు వంద కంటే ఎక్కువ మంది జనాభా ఉన్న ఐల్యాండ్‌లో పిల్లలే లేరట. అసలు ఆ ఐల్యాండ్‌కు ఎవరూ వెళ్లాలని కూడా అనుకోవడం లేదు. ఆసియాలో నాలుగవ అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ కలిగి దేశం దక్షిణ కొరియా. కానీ దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన జనాభా లేదిక్కడ..