Business Tips 2023: రూ.15 వేలతో పెట్టుబడి ప్రారంభించండి.. మూడు నెలల్లోనే రూ.4 లక్షలు సంపాదించండి

Basil Farming Benefits: మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారా..? మీ దగ్గర అధిక మొత్తంలో డబ్బులు లేవని వెనుకంజ వేస్తున్నారా..? మీకు ఇక బెంగ అక్కర్లేదు. తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి.. ఎక్కువ ఆదాయం అర్జించవచ్చు. ఎలాగో తెలుసుకోండి..
 

  • Feb 20, 2023, 19:53 PM IST
1 /7

హిందూ మతంలో తులసికి ఆధ్యాత్మికంగా.. ఆయుర్వేద పరంగా చాలా ప్రాముఖ్యత ఉంది. అంతే కాకుండా తులసి మొక్క మిమ్మల్ని లక్షాధికారిని కూడా చేస్తుంది. తులసి మొక్కను పెంచడం ద్వారా మీరు సులభంగా లక్షలు సంపాదించవచ్చు.   

2 /7

ప్రస్తుతం ప్రజలు రోగనిరోధక శక్తిని పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద మందులు కూడా ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ మందులన్నింటి తయారీలో తులసిని ఉపయోగిస్తారు. అందుకే తులసికి భారీగా డిమాండ్ పెరుగుతోంది.  

3 /7

జూలై నెలలో తులసి సాగు చేస్తారు. సాధారణ మొక్కను 45x45 సెం.మీ దూరంలో నాటాలి. కానీ RRLOC 12, RRLOC 14 జాతుల మొక్కలకు 50x50 సెం.మీ దూరం ఉంచాలి. ఈ మొక్కలు నాటిన తర్వాత నీటి సదుపాయం కల్పించడం చాలా అవసరం.

4 /7

తులసి మొక్కను కోయడానికి 10 రోజుల ముందు నీళ్లను పెట్టడం నిలిపివేయాలని నిపుణులు సూచిస్తున్నారు. మొక్క పెరిగినప్పుడు పంట తీస్తారు. మొక్క పుష్పించడం ప్రారంభించిన తరువాత.. దాని నూనె పరిమాణం తగ్గుతుంది. అందుకే ఈ మొక్కలు పుష్పించే సమయంలోనే కోయాలని చెబుతున్నారు.

5 /7

మొక్కలను మార్కెట్‌లో అయినా.. ఏజెంట్‌ను సంప్రదించి అయినా విక్రయించవచ్చు. మీరు కాంట్రాక్ట్ వ్యవసాయం చేస్తున్న ఫార్మాస్యూటికల్ కంపెనీలు లేదా ఏజెన్సీలకు కూడా మొక్కలను అమ్మవచ్చు. ఈ కంపెనీలు తులసికి అధిక ధరను చెల్లించి కొనుగోలు చేస్తున్నాయి. 

6 /7

అయితే తులసి సాగుకు పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. అలాగే పెద్దగా భూమి కూడా అవసరం లేదు. మీరు కేవలం రూ.15 వేలతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. 

7 /7

తులసిని నాటిన తరువాత కోతకు ఎక్కువ కాలం ఉండాల్సిన అవసరం లేదు. దీని ప్లాంట్ మూడు నెలల్లోనే సిద్ధమవుతుంది. తులసి పంటను దాదాపు రూ.3 నుంచి 4 లక్షల వరకు విక్రయిస్తారు. ఆయుర్వేద మందులు తయారు చేసే కంపెనీలు కాంట్రాక్టుపై వ్యవసాయం చేస్తున్నాయి. డాబర్, వైద్యనాథ్, పతాంజలి లాంటి ఎన్నో కంపెనీలతో కాంట్రాక్టు వ్యవసాయం చేసుకోవచ్చు. (గమనిక: ఇక్కడ వ్యాపారాన్ని ప్రారంభించే ఆలోచన గురించి మాత్రమే సమాచారం ఉంది. ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించే ముందు.. మీరు సంబంధిత రంగంలోని నిపుణుల నుంచి సలహా తీసుకోవాలి. దీంతో పాటుగా లాభాల గణాంకాలు మీ వ్యాపార విక్రయంపై ఆధారపడి ఉంటాయి.)