Nepal Earthquake Pics: ఎక్కడ చూసినా శిధిలాలే, భయం గొలుపుతున్న నేపాల్ భూకంపం దృశ్యాలు

Nepal Earthquake Pics: నేపాల్ భూకంపం ఆ దేశాన్ని వణికించేసింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రత నమోదైన భూకంపం కారణంగా  140 మృత్యువాత పడ్డారు. వందలాది మందికి గాయాలయ్యాయి. వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు జరిగిన భూకంపం కావడంతో ప్రాణనష్టం తీవ్రత ఎక్కువగానే ఉంది. 

Nepal Earthquake Pics: వాయువ్య నేపాల్‌లో సంభవించిన భూకంపం ప్రభావంతో ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, హర్యానా, బీహార్, ఉత్తరాఖండ్, యూపీ, పంజాబ్ రాష్ట్రాలవరకూ భూమి కంపించింది. నేపాల్‌లో భూకంపం ధాటికి వందలాది ఇళ్లు నేలకూలిన దృశ్యాలు భయం గొలుపుతున్నాయి. 

1 /6

నేపాల్ ప్రధాని ప్రచండ్ ఆ దేశ ఆర్మీకు చెందిన 16 మంది సభ్యుల మెడికల్ టీమ్‌తో కలిసి జాజర్‌కోట్‌కు రవాణా అయ్యారు. నిన్న రాత్రి సంభవించిన భూకంపం కేంద్రం కూడా జాజర్‌కోట్‌లోని బరేకోట్‌లో ఉంది. 

2 /6

ఉత్తర భారదేశంలో నెలరోజుల వ్యవధిలో భూమి కంపించడం మూడవసారి. అక్టోబర్ 22వ తేదీన కూడా నేపాల్‌లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తరువాత అంతకంటే తక్కువ స్థాయిలో మూడుసార్లు భూమి కంపించింది. 

3 /6

భూకంపం కారణంగా దక్షిణ జాజర్‌కోట్‌లోని చాలా ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయాయి. మరి కొన్ని ఇళ్ల గోడలు బీటలు వారాయి. కొన్ని ఇళ్లు పూర్తిగా కూలిపోతే మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

4 /6

నేపాల్‌లో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4 గా ఉంది. భూమిలో 10 కిలోమీటర్ల లోతులోనే భూకంప కేంద్రం ఉండటంతో తీవ్రత అధికంగా కన్పించింది. అందుకే 500-700 కిలోమీటర్ల దూరంలోని ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో కూడా భూమి కంపించింది. 

5 /6

నేపాల్ భూకంపంలో ఇప్పటి వరకూ 140 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చు. చాలామంది బయటకు పరుగులు తీసి ప్రాణాలు దక్కించుకున్నారు. 

6 /6

నేపాల్ భూకంపం నిన్న అంటే శుక్రవారం అర్ధరాత్రి 11.32 గంటలకు సంభవించింది. భూకంప కేంద్రం కూడా నేపాల్ కావడంతో తీవ్రత, ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా జాజర్ కోట్, రుకుం జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉంది.