Year Ender 2024 Marriages: 2024కు మరో వారం రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. ఈ యేడాది నాగ చైతన్య, శోభితతో పాటు కీర్తి సురేష్, సోనాక్షి సిన్హా, కిరణ్ అబ్బవరం సహా పలువురు హీరోలు, హీరోయిన్లు ఒకింటి వారయ్యారు. మొత్తంగా 2024లో పెళ్లి పీఠలు ఎక్కిన సినిమా సెలబ్రిటీలు ఎవరున్నారంటే..
నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల.. 2024 డిసెంబర్ 4 నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.
సుబ్బరాజు- స్రవంతి.. 2024 నవంబర్ 28న క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుబ్బరాజు- స్రవంతి పెళ్లితో ఒక్కటయ్యారు.
సిద్ధార్థ్ - అదితీరావు హైదరీ.. సిద్ధార్థ్ - అదితీరావు హైదరీ 2024లో సెప్టెంబరు 16న ఒకింటి వారయ్యారు.
కిరణ్ అబ్బవరం- రహస్య గోరఖ్ .. 2024 ఆగస్టు 22న కిరణ్ అబ్బవరం- రహస్య గోరఖ్ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు.
సోనాక్షి సిన్హా- జహీర్ ఇక్బాల్.. 2024 జూన్ 23న సోనాక్షి సిన్హా- జహీర్ ఇక్బాల్ మతాంతర వివాహాం చేసుకున్నారు.
కృతి కర్బంద- పులకిత్ సామ్రాట్.. కృతి కర్బంద- పులకిత్ సామ్రాట్ 2024 మార్చి 15న వీరి ప్రేమ పెళ్లికి దారి తీసింది.
రకుల్ ప్రీత్‌సింగ్- జాకీ భగ్నానీ.. 2024 ఫిబ్రవరి 21న రకుల్ ప్రీత్‌సింగ్ తన బాయ్ ఫ్రెండ్ జాకీ భగ్నానీ ని ప్రేమ వివాహాం చేసుకుంది.
కీర్తి సురేష్ - ఆంటోని తట్టిల్.. 2024 డిసెంబర్ 12న కీర్తి సురేశ్ తన బాయ్ ఫ్రెండ్ ఆంటోని తట్టిల్ ను హిందూ వివాహా పద్దతితో పాటు క్రిస్టియన్ పద్దతిలో పెళ్లి చేసుకోవడం విశేషం.