Fact Check: టెన్నిస్ స్టార్ సానియా మీర్జా..భారత స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీల ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకుంటున్నారని..ప్రస్తుతం వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు ఇందులో వాస్తవం ఎంతో తెలుసుకుందాం.
Fact Check: భారత స్టార్ క్రీడాకారులకు చెందిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టిమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ షమీ, మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా. వీరిద్దరు కూడా తమ భాగస్వాములతో విడాకులు తీసుకున్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తలపై వీరిద్దరూ కూడా స్పందించలేదు.
సానియా మీర్జా భారత్ తరపున అంతర్జాతీయ వేదికపై అద్భుతమైన విజయాలను సాధించారు. షమీ కూడా ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. క్రీడలతోపాటు వారి వ్యక్తిగత జీవితాలను గమనించినట్లయితే ఒకేవిధంగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీంతో వీరిద్దరూ కూడా కలిసి ఉన్నట్లు సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఇందులో నిజం ఎంతో తెలసుకునే ప్రయత్నం చేద్దాం.
సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను పెళ్లి చేసుకుని..ఒక బాబు పుట్టిన తర్వాత విడాకులు తీసుకున్నారు.
షమీ కూడా తన పర్సనల్ లైఫ్ లో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. భార్య హసీన్ జహన్ చేసిన ఆరోపణలపై పోలీసులు విచారణ కూడా ఎదుర్కొన్నారు. ఇప్పుడు వారిద్దరూ విడిపోయారు.
విడాకులు తీసుకున్న వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారన్న వార్తలు వచ్చాయి. అయితే సానియా, షమీ పెళ్లి వార్తలను ఖండించారు. అందులో వాస్తవం లేదని కొట్టిపారేశారు. అవన్ని తప్పుడు కథనాలే అన్నారు.
అయితే ప్రస్తుతం సానియా, షమీలు ఇద్దరూ కలిసి ఉన్నట్లు ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వారు వివాహం చేసుకున్నట్లు పేర్కొంటూ వైరల్ అవుతున్నాయి.
వీరిద్దరూ కలిసి దుబాయ్ క్రిస్మస్ జరుపుకున్నారని ఫొటోలు వైరల్ అయ్యాయి. కానీ ఇవన్నీ కూడా ఏఐ జనరేటెడ్ ఇమేజ్ లు అని మీడియా సంస్థలు నిర్థారించాయి.
కావాలనే కొంతమంది ఆకతాయిలు వీరిద్దరి ఫొటోలను ఏఐ జనరేటెడ్ చేశారని..పేర్కొన్నాయి. అయినప్పటికీ వీరిద్దరికి కొంతమంది శుభాకాంక్షలు కూడా తెలిపారు.
అయితే షమీ తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత పెళ్లి చేసుకోలేదు. సానియా కూడా విడాకులు ఇచ్చిన తర్వాత పెళ్లి చేసుకోలేదు. అయితే వీరిద్దరి ఫొటోలను ఇలా ఏఐ జెనరేటెడ్ చేయడం దుర్వినియోగం కారణంగా బాధితులు అయ్యే వారి సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని పలువురు హెచ్చరిస్తున్నారు.