Milk Super Benefits: పాలను సూపర్ ఫుడ్‌గా పిలుస్తారు. ఆరోగ్యానిక్ కావల్సిన అన్ని రకాల పోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయి. ముఖ్యంగా పిల్లలకు రోజూ తాగిస్తుంటారు. రోజూ పాలు తాగడం వల్ల ఆరోగ్యపరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆ వివరాలు మీ కోసం..
చర్మ, కేశ సంరక్షణ చర్మ, కేశ సంరక్షణకు మంచి ప్రత్యామ్నాయం. రోజూ పాలు తాగడం వల్ల చర్మం అందంగా ఉంటుంది. కేశాలు పటిష్టంగా మారతాయి
పాలు తాగడం వల్ల డయాబెటిస్ నియంత్రణ, బరువు తగ్గించడంలో లాభదాయకంగా ఉంటుంది. పాలలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఆకలిని తగ్గిస్తాయి. దాంతో బరువు నియంత్రణలో ఉంటుంది.
మంచి నిద్ర పాలలో మెలటోనిన్ ఉంటుంది. ఫలితంగా మంచి నిద్ర పడుతుంది. మానసిక ఆరోగ్యం లభిస్తుంది
ప్రమాదకర వ్యాధుల నుంచి రక్షణ పాలు రోజూ తాగడం వల్ల ఆస్టియో పోరోసిస్ వంటి ఎముకలకు సంబంధించిన ప్రమాదకర వ్యాధుల ముప్పు తగ్గుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కార్డియో వాస్క్యులర్ వ్యాధి కూడా దూరమౌతుంది. ఇందులో ఉండే పొటాషియం కారణంగా రక్తపోటు, గుండె వ్యాధులు, స్ట్రోక్ తగ్గుతాయి.
రోగ నిరోధక శక్తి పాలలో ఉండే విటమిన్ బి12, ఇతర మినరల్స్ కారణంగా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
రోగ నిరోధక శక్తి పాలలో ఉండే విటమిన్ బి12, ఇతర మినరల్స్ కారణంగా శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
ఎముకలు, పళ్లకు బలం రోజూ పాలు తాగడం వల్ల కాల్షియం, విటమిన్ డి కావల్సినంత లభిస్తాయి దాంతో ఎముకలు, పళ్లు పటిష్టంగా ఉంటాయి.
కండరాలకు బలం పాలలో ఉండే ప్లోటీన్లు కండరాలకు బలాన్నిస్తాయి. కణజాలం మరమ్మత్తులో వీటి పాత్ర కీలకం. తద్వారా ఎనర్జీ అందుతుంది.