Mumbai Indians Captain Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ ను కాదని హార్దిక్ పాండ్యాకు ఇచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించిన ఓ కాంట్రవర్శీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ ఐపీఎల్ 2024 సీజన్ కోసం ముంబై జట్టుకు కొత్త కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఎంపికయ్యాడు. అతని నాయకత్వంలో ముంబై జట్టు రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడం పట్ల ముంబై అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో హార్దిక్ పాండ్యాపై మైదానంలో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది.
ఈ సందర్భంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడని.. రోహిత్ శర్మ మళ్లీ కెప్టెన్సీ తీసుకున్నాడని ఎక్స్ సైట్‌లో ఒకరు పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఇది ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇది నిజమని చాలామంది నమ్ముతున్నారు. అయితే ఇది పూర్తిగా తప్పుడు సమాచారం అని తెలుస్తోంది.
ముంబై జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా కొనసాగుతాడని.. రోహిత్ శర్మ అతనికి మద్దతునిస్తాడని ముంబై మేనెజ్మెంట్ పేర్కొన్నట్లు సమాచారం.