Mercury transit adverse effects in telugu: గ్రహాల్లో రాజకుమారుడిగా భావించే బుధుడు ఇవాళ సెప్టెంబర్ 23న కన్యా రాశిలో ప్రవేశించనున్నాడు. కన్యా రాశిలో ఇప్పటికే సూర్యుడు కొలువుదీరి ఉండటంతో రెండు గ్రహాల అరుదైన కలయికతో యుతి ఏర్పడుతుంది. ఫలితంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడి 4 రాశులవారికి నరకప్రాయంగా మారవచ్చు. ఆ దురదృష్టవంతులెవరో తెలుసుకుందాం.

కుంభ రాశి కుంభ రాశి జాతకులకు బుధుడి గోచారం ప్రభావం ప్రతీకూలంగా ఉండనుంది. ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటాయి. తీవ్రమైన ఆందోళన, ఒత్తిడి ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే సమస్యలు ఎదురుకావచ్చు.
తులా రాశి తులా రాశి జాతకులకు అక్టోబర్ 10 వరకూ అన్నీ సమస్యలే. ఊహించని డబ్బు ఖర్చు ఉంటుంది. వ్యాపారంలో నష్టాలు ఎదురు కావచ్చు. ప్రయాణాలు కలిసిరావు. అక్టోబర్ 10 వరకు ప్రయాణాలు చేయకుంటే మంచిది. ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగా ఉంటుంది.
కర్కాటక రాశి బుధ గోచారం కారణంగా కర్కాటక రాశి జాతకులకు ఉద్యోగ, వ్యాపారాల్లో ఇబ్బందులు ఎదురుకావచ్చు. అందుకే ఉద్యోగం చేసే చోట మీ పని పూర్తి చేయడంపై దృష్టి పెట్టండి. చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు. ఆర్ధికంగా ఇబ్బందులు ఎదురౌతాయి. ధననష్టం కలుగుతుంది
మేష రాశి బుధాదిత్య రాజయోగం కారణంగా కొందరికి అద్భుతంగా ఉన్నా మేష రాశి జాతకులకు తీవ్రమైన నష్టం కలగనుంది. ఆర్ధికంగా ఇబ్బందులు తప్పవు. ఆరోగ్యం విషయంలో తరచూ ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తుంది. చేపట్టిన పనులకు విఘాతం కలుగుతుంది.
అక్టోబర్ 10 వరకు జూగ్రత్త హిందూ జ్యోతిష్యం ప్రకారం బుధుడిని ధనం, కెరీర్‌కు ప్రతీకగా భావిస్తారు. అందుకే బుద గ్రహం శుభ స్థితిలో ఉంటే కెరీర్ కావచ్చు లేదా వ్యాపారం కావచ్చు అద్భుతంగా ఉంటుంది. కానీ అశుభ స్థితిలో ఉంటే అనేక నష్టాలు కలగనున్నాయి. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 10 వరకూ కన్యా రాశిలో ఉండటం వల్ల 4 రాశులకు కష్టకాలం ప్రారంభమైందని చెప్పవచ్చు