Sai Dharam Tej Engagement : సాయి ధరం తేజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. సినిమాలకన్నా ఎక్కువ తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా.. ఎల్లప్పుడు ప్రేక్షకులకు టచ్ లో ఉంటాడు ఈ హీరో. ఈ క్రమంలో ఈ మెగా కాంపౌండ్ హీరో త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారు అని తెలుస్తోంది.
పిల్ల నువ్వు లేని జీవితం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మెగా కాంపౌండ్ హీరో సాయిధరమ్ తేజ్. మొదటి సినిమాతోనే పరవాలేదు అనిపించుకున్న ఈ హీరోకి.. ఆ తరువాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సుప్రీమ్ సినిమా మంచి విజయం అందజేసింది…
ఇక ఆ తరువాత మాత్రం ఈ హీరోకి అనుకున్న స్థాయిలో విజయాలు రాలేదు. దానికి తోడు మధ్యలో యాక్సిడెంట్ కూడా కావడంతో.. చాలా రోజులు సినిమాలకు దూరంగా ఉన్నారు.
ఇక ఈ మధ్యనే విరూపాక్ష సినిమాతో మరోసారి విజయం అందుకున్నారు. ఈ క్రమంలో ఈ హీరో త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అన్న వార్త తెగ వైరల్ అవుతుంది
అది కూడా మరెవరితోనో కాదు.. తెలుగులో కొన్ని సూపర్ హిట్ సినిమాలలో నటించిన మెహరీన్ తో. మెహరీన్ 2022లో.. పొలిటీషియన్ భవ్య బిష్ణో తో ఎంగేజ్మెంట్ చేసుకొని ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల బ్రేకప్ చెప్పింది.
ఈ క్రమంలో ఎప్పుడు ఈ హీరోయిన్ సాయి ధరంతేజ్ తో ప్రేమలో ఉందని.. వీరిద్దరి త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాదు వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఈ సంవత్సరంలోనే ఉండొచ్చు అని కూడా వినికిడి. ఈ వార్తల్లో నిజమెంటో తెలియాలి అంటే.. వీరిద్దరిలో ఎవరో ఒకరు చెప్పే వరకు వేచి చూడాల్సిందే.