Meenakshi Chaudhary: చీరలో మెరిసిపోయిన మీనాక్షి.. ఫిదా అవుతున్న అభిమానులు

Meenakshi Chaudhary Saree Photos: అందం, అభినయంతో తెగ ఆకట్టుకుంటుంది హీరోయిన్ మీనాక్షి చౌదరి. ప్రస్తుతం ఈ నటి షేర్ చేసిన ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.

1 /6

మీనాక్షి చౌదరి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. అందంతోనే కాకుండా తన అభినయంతో కూడా ఆకర్చుకుంటూ ఉంటుంది ఈ హీరోయిన్.

2 /6

సుశాంత్ హీరోగా చేసిన ఇచ్చుట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. అయితే ఈ మొదటి సినిమా ఈమెకు పెద్దగా గుర్తింపు మాత్రం తెచ్చి పెట్టలేదు.  

3 /6

ఇక ఆ తరువాత వచ్చిన రవితేజ ఖిలాడి చిత్రం పెద్దగా విజయం సాధించకపోయిన.. మీనాక్షి చౌదరికి మాత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది. 

4 /6

ఆ తరువాత అడివి శేషు.. హీరోగా చేసిన హిట్  2 సినిమాతో మంచి విజయం అందుకుంది. ఈ చిత్రం ఈ హీరోయిన్ కి కమర్షియల్ సక్సెస్.. ఇవ్వడమే కాకుండా మరిన్ని అవకాశాలను కూడా తెచ్చిపెట్టింది.  

5 /6

ఈ మధ్యనే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేసిన గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ప్రస్తుతం ఎన్నో తమళ సినిమాలతో కూడా బిజీగా ఉంది ఈ హీరోయిన్.

6 /6

ఈ క్రమంలో ఎంతో చక్కగా బాపు గారి బొమ్మలా.. మీనాక్షి చౌదరి చీరలో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.