Benefits of makhanas: మఖానా అంటే అందరికీ తెలుసు. ఇది మంచి స్నాక్ ఐటమ్. నిజానికి ఇవి తామర పువ్వుల నుంచి సేకరించిన గింజలు. వీటిని రూజువారీ డైట్లో చేర్చుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మఖానా తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.

తామర పూల గింజలను పేలాలుగా మార్చితే వాటిని పూల్ మఖాన అంటారు. ఇది ఒక టేస్టీ స్నాక్. అలాగే ఈ గింజలను కూరల్లో కూడా వాడుకోవచ్చు.మఖానా గింజలతో చేసిన కూర చాలా రుచికరంగా ఉంటుంది. అంతేకాదు ఇది ఎంతో ఆరోగ్యానికి మంచిది. తేలికగా అరిగిపోతుంది.
మఖానా గింజలు పుష్కలంగా ప్రోటీన్లను కలిగి ఉంటాయి. అంతేకాదు వీటిలో ఫైబర్ కూడా పెద్ద మొత్తంలో లభిస్తుంది ఇది జీర్ణశక్తికి ఎంతో మంచిది.
మఖాన గింజల్లో ఉండే పోషకాలు మీ శరీరంలో అనేక రకాల జబ్బుల నుంచి కాపాడుతాయి. వీటిలో ప్రధానంగా కొవ్వును కరిగించే లక్షణాలు ఉన్నాయి.
ఎవరైతే బరువు తగ్గాలని ఎక్కువగా ప్లాన్ చేస్తూ ఉంటారో, వారు మఖానా గింజలను రెగ్యులర్ గా డైట్ లో చేర్చుకున్నట్లైతే, ఆరోగ్యానికి చాలా మంచిది.
మఖాన గింజల్లో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి ప్రధానంగా ఫైబర్ తో నిండి ఉంటాయి. ఇవి మీ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తొలగించేందుకు ఉపయోగపడతాయి.
మఖాలా గింజలు డయాబెటిస్ పేషెంట్లకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడతాయి.
మఖాన గింజలను తీసుకున్నట్లయితే రక్తపోటు కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది బిపిని కూడా తగ్గిస్తాయి.