Best Smartphones Under 12000: అద్భుతమైన ఫీచర్లు, లాంగ్ బ్యాటరీతో ఉండే స్మార్ట్ఫోన్ల కోసం ట్రై చేస్తుంటే ఇదే మంచి అవకాశం. తక్కవ ధరలోనే అంటే కేవలం 12 వేల బడ్జెట్‌కే మీరు కోరుకున్న ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్ పొందవచ్చు. అది కూడా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లు. అలాంటి టాప్ 5 స్మార్ట్ఫోన్లు, వాటి ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
Motorola G45 5G ఇది కూడా 5జి స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ ధర 11,999 రూపాయలు మాత్రమే. ఇందులో స్నాప్‌డ్రాగన్ 6ఎస్ జనరేషన్ 3 చిప్సెట్ ప్రోసెసర్ ఉంటుంది. ఇది రెండు వేరియంట్లలో లభిస్తోంది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.5 ఇంచెస్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్ కలిగి ఉంటుంది. ఇక బ్యాటరీ అయితే 5000 ఎంఏహెచ్ సామర్ధ్యంతో పనిచేస్తుంది.
Samsung Galaxy M15 5G శాంసంగ్ కంపెనీకు చెందిన ఈ ఫోన్ కేవలం 10,999 రూపాయలకే లభిస్తుంది. ఇదొక 5జి స్మార్ట్‌ఫోన్. ఇది 6.5 ఇంచెస్ ఎమోల్డ్ డిస్ప్లేతో వస్తుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్ ఉంటుంది. మైక్రో ఎస్డీ కార్డు ద్వారా స్టోరేజ్ పెంచుకోవచ్చు.
POCO M6 Pro 5G ఈ ఫోన్ 6.79 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్‌తో 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 4 జనరేషన్ 2 చిప్సెట్ ప్రోసెసర్ ఉంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉంటుంది. ఈ ఫోన్ ధర కేవలం 10,999 రూపాయలు మాత్రమే
Nokia G42 5G 12 వేల బడ్జెట్లో నోకియా స్మార్ట్‌ఫోన్ బెస్ట్ ఆప్షన్. ఈ ఫోన్ 6.56 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్‌తో 450 నిట్స్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఇది 20 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000 ఎంఏహెచ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ధర కేవలం 11,499 రూపాయలు.
iQOO Z9 Lite 5G ఈ ఫోన్ 6.56 ఇంచెస్ ఐపీఎస్ ఎల్సీడీ స్క్రీన్ కలిగి ఉంటుంది. 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. యాంటీ డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐపీ 64 రేటింగ్ కలిగి ఉంది. ఈ ఫోన్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా, 2 మెగా పిక్సెల్ డ్యూయల్ రేర్ కెమేరా ఉంటాయి. సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. ఈ ఫోన్ ధర కేవలం 10,498 రూపాయలు