ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) చరిత్రలో అత్యంత వేగవంతమైన శతకాన్ని (fastest centuries in IPL history) విండీస్ విధ్వంసక క్రికెటర్ క్రిస్ గేల్ తన పేరిట లిఖించుకున్నాడు. కేవలం 30 బంతుల్లో గేల్ ఈ శతకాన్ని సాధించాడు. యూసఫ్ పఠాన్, డేవిడ్ మిల్లర్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఏబీ డివిలియర్స్, డేవిడ్ వార్నర్‌లు ఫాస్టె్స్ట్ ఐపీఎల్ శతకం చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు.
యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్ పూణే వారియర్స్‌పై చేసిన శతకం ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన శతకం. 30 బంతుల్లో శతకం బాదేశాడు. 66 బంతుల్లో 13 ఫోర్లు, 17 సిక్సర్లు సాయంతో 175 పరుగులు చేశాడు.
రాజస్థాన్ రాయల్స్‌కు ఆడే సమయంలో యూసఫ్ పఠాన్ ముంబై ఇండియన్స్‌పై 37 బంతుల్లో శతకం బాదేశాడు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరఫున ఆడుతూ డేవిడ్ మిల్లర్ ప్రత్యర్థి జట్టు ఆర్సీబీపై 38 బంతుల్లో ఐపీఎల్ సెంచరీ సాధించాడు. దీంతో 191 పరుగుల లక్ష్యాన్ని 18 ఓవర్లలోనే పంజాబ్ ఛేదించింది.
దక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడే సమయంలో ఆడమ్ గిల్‌క్రిస్ట్ 42 బంతుల్లో సెంచరీ సాధించాడు.
ఆర్సీబీ ప్లేయర్, విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్ 43 బంతుల్లోనే గుజరాత్ లయన్స్ మీద శతకం బాదాడు.
2017లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 43 బంతుల్లోనే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుపై సెంచరీ సాధించాడు.
Next Gallery