Tea Side Effects: సమ్మర్ లో టీ అతిగా తాగుతున్నారా..?.. ఈ డెంజర్ లో పడ్డట్లే..


Summer Season: కొందరు టీని అతిగా తాగుతుంటారు. అసలు రోజు ప్రారంభం కావాలంటేనే పొట్టలో చాయ్ పడాల్సిందే. ఖాళీ పొట్టతో చాయ్ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు..

1 /6

మనలో చాలా మంది చాయ్ లకు బానిసలుగా ఉంటారు. ఇలాంటి వారు పొద్దున చాయ్ తాగంది ఏపని కూడా చేయరు. కానీ ఖాళీ పొట్టతో చాయ్ తాగడం వల్ల, కడుపులో జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలు ఉత్పన్నమవుతాయి.  

2 /6

వేడి వేడిగ చాయ్ లు తాగడం వల్ల కడుపులోని పేగులు కూడా తీవ్రంగా ప్రభావితమౌతాయి. కొందరు రిఫ్రేష్ కోసం టీని తరచుగా తాగుతుంటారు. సమ్మర్ లో టీని మాత్రం కాస్తంతా అవాయిడ్ చేయాలంట..  

3 /6

ముఖ్యంగా ఏదైన పదార్థం తిన్నాక.. మాత్రమే టీ కానీ, కాఫీలు కానీ తాగాలి.  లేకుంటే పొట్టలో ఇబ్బందులు వస్తుంటాయి. టీ అతిగా తాగే వారికి ఆకలి మందగిస్తుంది.

4 /6

సమ్మర్ లో బైటీ వాతావరణం, వేడిగా ఉంటుంది. అందుకే ఈకాలంలో టీ తాగడం తగ్గించాలి. కొందరు రాత్రి పడుకునే ముందు కూడా టీని తాగుతుంటారు. ఇలాంటి వారిలో నిద్ర అస్సలు ఉండదు.    

5 /6

ప్రెగ్నెంట్ మహిళలు కూడా  టీ తాగడం తగ్గించాలి. చాయ్ ను అతిగా తాగడం వల్ల కడుపులో పిండానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది.  

6 /6

చాలా మందిలో టీ వల్ల ఎసిడిటీ సమస్యలు తలెత్తుతాయి. దీంతో ఆకలి మందగించడం, ఉబ్బరం, చికాకులు, అసౌకర్యం వంటివి కల్గుతాయి.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)