Jaggery: ఖాళీ పొట్టతో ఉదయాన్నే బెల్లం తింటే ఎన్ని ప్రయోజనాలో మీకు తెలుసా..?

Life Style: బెల్లంకు మన ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. దీన్ని ప్రతిరోజు ఉదయం పరగడుపున తింటే ఎంతో ప్రయోజనకరమని నిపుణులు చెబుతుంటారు. ఉదయం లేవగానే ఫ్రెష్ అయ్యాక.. బెల్లం తింటే ఆరోజు ఎంతో యాక్టివ్ గా ఉంటుందని  నిపుణులు సూచిస్తారు..

1 /6

మనదేశంలో చక్కెర తర్వాత ఎక్కువ మంది బెల్లను ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా శుభకార్యాలలో బెల్లం వినియోగించడం మంచిదని పెద్దలు చెబుతుంటారు. ప్రతిరోజు ఉదయం బెల్లం, నువ్వుల పొడితో తయారు చేసిన లడ్డులను తినాలంటారు..  

2 /6

ఉదయాన్నే బెల్లం తింటే శరీరంలోని ఆర్గాన్స్ అన్ని యాక్టివ్ అవుతాయి. జీర్ణ వ్యవస్థలో ఏదైన ఇబ్బందులుంటే వెంటనే తొలగిపోతాయి. శరీరానికి కావాల్సిన పోషకాలు, మినరల్స్ లు బెల్లం తో మనకు అందుతాయి. ఇమ్యునిటీ మెరుగుపరుస్తుంది.

3 /6

మనకు ఎప్పుడైన సత్తువ లేనప్పుడు , కళ్లు తిరిగినట్లు అన్పిస్తే.. బెల్లం ముక్క ఒకటి నోట్లో వేసుకుంటే వెంటనే యాక్టివ్ గా అయిపోతాం. బరువు పెరగకుండా కూడా ఇది చూస్తుంది. చక్కెర కన్నా కూడా బెల్లం టీ తాగడం మంచిదని నిపుణులు చెబుతారు..

4 /6

కడుపులో వికారం,వాంతులు వచ్చిన లేదా మోషన్స్ అయిన కూడా బెల్లం తింటే వెంటనే ఉపశమనంగా ఉంటుది. బెల్లంను ఏ కాలంలో నైన తినోచ్చు. గొంతు సమస్యలను కూడా దూరం చేస్తుంది. 

5 /6

కొందరికి ఎముకల వదులుగా నొప్పులుగా ఉంటాయి. ఇలాంటి  వారు ప్రతిరోజు బెల్లం తింటే ఎంతో ప్రయోగజన కరంగా ఉంటుంది. మహిళలు బెల్లం రెగ్యులర్ గా తింటే పీరియడ్స్ సమయంలో పొత్తి కడుపులో నొప్పి ఉండదు.

6 /6

కొందరిలో బీపీ అధికంగా ఉంటుంది. తరచుగా శరీంలో ఉష్ణోగ్రతలు అబ్ నార్మల్ గా అవుతుంటాయి. ఇలాంటి వారికి కూడా ఇది పనిచేస్తుంది. వయసుకన్న ముందే కొందరికి ముఖంపై ముడతలు, తెల్ల వెంట్రులకు వస్తాయి. బెల్లం తింటే వీటికి చెక్ పెట్టేయోచ్చు. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)