Mehndi Tips:ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే మీ మెహందీ కుంకుమలా ఎర్రగా పండుతుంది..

Life Style: మనలో చాలా మంది పెళ్లిళ్లకు, శుభకార్యాలకు చేతికి మెహందీ పెట్టుకుంటారు. కొందరికి చేతికి ఎర్రగా మారితే, మరికొందరికి మాత్రం చేతికి ఎర్రగా కాకుండా నల్లగా మారుతుంది. కొన్ని టిప్స్ పాటిస్తే మెహందీ రంగు కుంకుమలా ఎర్రగా మారుతుంది. 

1 /6

ఇంట్లో శుభకార్యాలకు, పండుగల సమయంలో చాలా మంది అమ్మాయిలు, మహిళలు చేతినిండా మెహందీలు పెట్టుకుంటారు. కొందరు కాళ్లకు, చేతులకు మెహందీలు పెట్టుకుంటారు  

2 /6

మార్కెట్ లలో అనేక వెరైటీలలో మెహందీలు దొరుకుంటాయి. కొన్ని మెహందీలు ఇన్ స్టాంట్ గా రెడీ చేస్తుంటారు. మరికొన్నింటికి మాత్రం.. ఆకులతో మిక్సర్ లో వేసి పేస్ట్ లాగా చేసి మరీ మెహందీ లు తయారు చేస్తారు

3 /6

రకరకాల డిజైన్ లలో మెహందీలను పెట్టుకుంటారు. దీనికోసం స్పెషల్ గా డిజైన్ లు వేసేవారు ఉంటారు. మెహందీ డిజైన్ లను బట్టి, చార్జీలుగా వేర్వేరుగా ఉంటాయి. 

4 /6

మెహందీ పెట్టుకున్నాక అది పూర్తిగా ఎండిపోయే వరకు ఆగాలి. ఆ తర్వాత... నీళ్లలోచక్కెర, నిమ్మకాయను పిండాలి. ఇలా మిక్స్ చేసిన నీళ్లను మెహందీ పెట్టుకున్న చేతులకు పెట్టుకొవాలి.  

5 /6

ఇలా చేతికి ఈ నీళ్లను అప్లై చేసి ఒక గంట పాటు ఉంచాలి. దీంతో మెహందీ ఎర్రగా మారుతుందంటారు. ఎర్రగా అవుతుందో లేదో అని టెన్షన్ ఉన్నవారు ఇలా చేస్తే వెంటనే రిజల్ట్ ఉంటుంది.

6 /6

మెహందీ రాత్రిపూట పెట్టుకుని, చక్కెర, నిమ్మకాయ కలిపిన ద్రావణంను చేతికి పెట్టి ఉదయంపూట కడిగేసుకొవాలి. ఇలా చేస్తే చేతికి, కాలికి పెట్టుకున్న మెహందీ కుంకుమ రంగులో ఎర్రగా మారుతుంది.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)