Smelly Shoes: మీ బూట్ల నుంచి భరించలేని దుర్వాసన వస్తుందా..?.. ఈ సింపుల్ టిప్స్ తో చెక్ పెట్టేయోచ్చు..

Life Style: మనలో చాలా మందికి ప్రతిరోజు షూస్ లు వేసుకునే అలవాటు ఉంటుంది. ఆఫీసులకు వెళ్లిన, బైటకు వెళ్లిన కూడా షూస్ ను మాత్రం అస్సలు వదలరు. కానీ కొన్నిసార్లు షూస్ నుంచి భరించలేని దుర్వాసన వస్తుంది.

1 /7

ప్రస్తుతం చాలా మంది యువతీ, యువకులు షూస్ ను తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. చెప్పుల ఉపయోగం చాలా వరకు తగ్గిపోయి ,బూట్ల వాడకం పెరిగింది. కానీ కొన్నిసార్లు బూట్ల నుంచి భరించలేని దుర్వాసన వస్తుంది. 

2 /7

కొందరి శరీరంలో నుంచి ఎక్కువగా చెమట వస్తుంటుంది. దీంతో స్మెల్ ఎక్కువగా వస్తుంది. అందుకే సాక్స్ ను తడిగా కాకుండా చూసుకొవాలి. తడిగా ఉన్న సాక్స్ ల నుంచి భరించలేని దుర్వాసన వస్తుంది.

3 /7

బూట్లను ఉపయోగించిన తర్వాత గాలి ఆడేటట్లు బైట పెట్టాలి. సాక్స్ ను ఎప్పటికప్పుడు ఉతికేసి ఆరేయాలి. కానీ కొందరు వారాం వారం, ఒకే జత సాక్స్ లను ధరిస్తారు. దీంతో  బూట్లనుంచి భరించలేని దుర్వాసన వస్తుంది.  

4 /7

ముఖ్యంగా బైటకు రాగానే సాక్స్ తీసి పక్కన పెట్టాలి. షూస్ లేస్ ను కూడా ఉతికి ఎప్పటికప్పులు క్లీన్ గా ఉంచుకొవాలి. వారానికి ఒకసారి షూస్ ను కూడా క్లీన్ గా కడిగేసుకొవాలి. ఇలా చేస్తే బ్యాక్టిరియాలు, వైరస్ లు ఉండవు.

5 /7

నిమ్మకాయ తొక్కను బూట్లలో వేస్తే చెడు వాసన రాదు. అందుకే రాత్రిపూట నిమ్మకాయ తొక్కను బూట్లలో వేసి పొద్దున  తర్వాత తీసేయాలి. ఇలా చేస్తుంటే బూట్ల నుంచి దుర్వాసన అనేది అస్సలు ఉండదు.  

6 /7

తడిగా ఉన్న బూట్లలో బేకింగ్ సోడా వేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇది బూట్లలోని తేమను గ్రహించుకుంటుంది. అందుకే షూస్  వాసన వచ్చినప్పుడు బేకింగ్ సోడా వేస్తుండాలి. కొన్నిరకాల పౌడర్ లు వేసిన కూడా దుర్వాసన రాదు

7 /7

కొందరు బూట్లను కాగితంలో చుట్టి ఫ్రిజ్ లో పెడుతుంటారు. కాగితం బూట్లలోని తేమను పూర్తిగా గ్రహించుకుంటుంది. మెయిన్ గా సాక్స్ ను తడిగా అవ్వకుండా జాగ్రత్తలు తీసుకొవాలి.