Food Not To Eat AT work Place: చాలా మంది ఏదోఒక ఉద్యోగం చేస్తునే ఉంటారు. ఈమధ్య కాలంలో ఎవరు కూడా ఖాళీగా ఉండటానికి అస్సలు ఇష్టపడట్లేదు. బిజినెస్ లేదా జాబ్ లు, తమకు తోచిన రంగంలో రాణించడానికి యువత ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. కానీ పనిప్రదేశంలో కొన్ని రూల్స్ తప్పకుండా పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
సాధారణంగా చాలా మంది యువతకు బైటి ఫుడ్ తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇళ్లలో ఏదైన ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకొవడానికి తగినంత సమయం అస్సలు దొరకట్లేదు. దీంతో యువత బైట రెడీగా దొరికే ఫుడ్ ఐటమ్స్ లను తినడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. కానీ దీన్ని వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి.
డైలీ ఉదయాన్నే టిఫిన్, లంచ్, ఈవెనింగ్ స్నాక్స్ తినాలి. రాత్రిపూట ఏజ్ ను బట్టి డిన్నర్ చేయాలి. కానీ కొందరు దీన్ని పూర్తిగా స్కిప్ చేస్తున్నారు. చాలా మంది అసలు టిఫిన్ తినడం మానేశారు. దీని వల్ల కడుపులో అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. మన కడుపులో కొన్కిరసాయనాలు విడుదలవుతుంటాయి.
అలాంటి సమయంలో మనం టైమ్ టూ టైమ్ తినడం చాట్ ను ఫాలో అవ్వాలి. లేకుంటే ఈ లిక్విడ్ వల్ల కడుపులోని ఇతర అవయవాలు ప్రభావితం అవుతాయి. కొందరు దీనికి భిన్నంగా అతిగా తింటుంటారు. అతిగా ఏది చేసిన అది మనకు ఇబ్బందులు పెట్టేదిగానే మారుతుంది. అందుకే వైద్యుల సూచనలను పాటిస్తూ ఫుడ్ తినాలి.
కొందరు పనిచేసే సమయంలో జంక్ ఫుడ్, చిరుతిండ్లను ఎక్కువగా తింటారు. ఇలా చేయడం వల్ల సమస్యలు తప్పవు. మనం వర్క్ చేసేటప్పుడు .. ఉపయోగించే ల్యాప్ టాప్ మీద కోట్లాది క్రిములు ఉంటాయి. కొందరు అలానే తమ వేళ్లను ముక్కులో, నోళ్లలో పెట్టుకుంటారు. మరలా అలానే వర్క్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల పొట్టలో సమస్యలు వస్తాయి.
కొందరికి ఒక్కసారిగా పొత్తి కడుపులో నొప్పి వస్తుంటుంది. అది ఇలాంటి పనులు చేయడం వల్లనే అనినిపుణులు చెబుతుంటారు. ఇక.. చిరుతిండ్లు తింటే మన ఆకలి చచ్చిపోతుంది. ఇక.. ఫుడ్ తినడం అవాయిడ్ చేస్తారు. ఇలానే కొనసాగితే.. మన కడుపులో వేళకు రిలీజ్ కావాల్సిన రసాయనాలు అస్సలు ఉత్పన్నం కావు..
చేతులు సరిగ్గా క్లీన్ చేయకుండానే తినడంలాంటివి చేస్తుంటే, గొర్లలోని మలినాలు కూడా నేరుగా కడుపులోకి పోతాయి. ఇక వర్క్ చేసేటప్పుడు కొందరు ఏదో ఒకటి తింటారు. కొన్నిసార్లు పురుగులు కూడా పొట్టలోకి పోయే ప్రమాదం కూడా ఉంది. మరికొన్నిసార్లు మన ల్యాప్ టాప్ ల మీద నీళ్ల, ఏదైన లిక్విడ్ లు పడే చాన్స్ ఉంది. అందుకే పని ప్రదేశంలో ఈ తినడం అలవాటును అవాయిడ్ చేయాలని నిపుణులు చెబుతుంటారు. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)