Lavanya Tripathi Photos: అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి.. తన క్యూట్ లుక్స్.. మాటలతో ఆకట్టుకుంది. ఆ సినిమాలో అల్లరి పిల్లగా తన నటనతో అలరించింది. మరోవైపు సోషల్ మీడియాతో తెగ యాక్టివ్‌గా ఉంటోంది ఈ బ్యూటీ.
తాజాగా గ్రీన్ శారీలో కత్తిలాంటి పోజులతో కుర్రకారు మతిపోగుడుతోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్లో మెడలో హారం ధరించి మెరిసింది.
కూర్చీలో కూర్చున్న అమాయకపు చూపులతో ఆకట్టుకుంటోంది. లైఫ్ ఈజీ ఏ పార్టీ.. నేను గ్రీన్ ధరించా.. అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.
అయోధ్యలో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. 2006లో మిస్ ఉత్తరాఖండ్ కిరీటం గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.
తన తొలి సినిమా అందాల రాక్షసి మూవీతోనే టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈ భామ జోరు ఈ మధ్య తగ్గిపోయింది.
ప్రస్తుతం తమిళంలో ఓ సినిమాలో యాక్ట్ చేస్తోంది లావణ్య. తెలుగులో చివరగా హ్యాపీ బర్త్ డే మూవీలో నటించింది.