Trending Small Business Idea: తక్కువ ఇన్వెస్ట్మెంట్‌తో అదిరిపోయే బిజినెస్.. ఇలా చేస్తే నెలకు రూ. 50 వేల లాభం మీ సొంతం!

Soup Shop Small Business Idea: చిన్న వ్యాపారాలకు మార్కెట్‌లో గిరాకీ పెరుగుతున్నది ముఖ్యంగా  ఫూడ్‌, ఆన్‌లైన్ వ్యాపారాలు, సర్వీస్-ఆధారిత వ్యాపారాలు బాగా వృద్ధి చెందుతున్నాయి. కానీ ఫూడ్‌ బిజినెస్‌ స్టార్ట్‌ చేయాలని ఆలోచిస్తే చలికాలం బెస్ట్ సీజన్ అని నిపుణులు చెబుతున్నారు.  చలికాలంలో వేడి వంటకాల డిమాండ్ పెరుగుతుంది కాబట్టి ఈ రకమైన వ్యాపారాలకు మంచి సీజన్. అయితే ఇప్పుడు మీరు తెలుసుకొనే వ్యాపారం సూప్ షాప్‌ బిజినెస్‌ ఐడియా. ఈ బిజినెస్‌ను అతి తక్కువ ఖర్చుతో ప్రారంభించవచ్చు. ఈ బిజినెస్‌ను ఎలా ప్రారంభించాలి..? ఎంత పెట్టుబడి పెట్టుకోవాలి అనే వివరాలు తెలుసుకుందాం. 

1 /7

 చలికాలంలో సూప్‌ బిజినెస్‌లకు భారీ డిమాండ్‌ ఉంటుంది. వాతావరణం చల్లగా ఉండటంతో, వెచ్చని సూప్ తాగడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. ఇది చాలా మందికి ఆకర్షణీయంగా ఉంటుంది.  

2 /7

సూప్‌లు పోషకాలతో నిండి ఉంటాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. శీతాకాలంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి సూప్‌లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.  

3 /7

సూప్‌లు తయారు చేయడానికి అధిక ఖర్చు అవసరం లేదు. అందుకే చాలా మందికి ఇది సరసమైన ఆహారంగా అనిపిస్తుంది. సూప్‌లు త్వరగా తయారు చేయడానికి అనువుగా ఉంటాయి. ఇది బిజీగా ఉన్న వారికి  తినడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

4 /7

అయితే సూప్ బిజినెస్‌లు ప్రారంభించేవారు వివిధ రకాల సూప్‌లను తయారు చేయడం ద్వారా మరింత మందిని ఆకర్షించవచ్చు. వెజిటేరియన్, నాన్-వెజిటేరియన్, క్రీమీ, స్పైసీ అనేక రకాల సూప్‌లను తయారు చేయవచ్చు.

5 /7

ఆకర్షణీయమైన ప్యాకేజింగ్‌తో సూప్‌లను అమ్మడం ద్వారా కస్టమర్లను ఆకర్షించవచ్చు. సోషల్ మీడియా, వెబ్‌సైట్‌లు వంటివి ఉపయోగించి సూప్ బిజినెస్‌ను ప్రచారం చేయవచ్చు.

6 /7

ఈ బిజినెస్‌ స్టార్ట్‌ చేయడానికి రూ. 1.5 లక్షల పెట్టుబడితే నెలకు రూ. 50 వేల సంపాదించవచ్చు. మీ వద్ద పెట్టుబడికి డబ్బులు లేకపోతే ప్రభుత్వం ఇచ్చే ముద్ర యోజనతో కూడా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. 

7 /7

సూప్‌ బిజినెస్‌తో నెలకు రూ. 50 వేల సంపాదించవచ్చు. సంవత్సరానికి రూ. 600,000 సంపాదించవచ్చు. అయితే ప్రతి వారం లేదా ప్రతి నెలా ఒక కొత్త థీమ్‌ను ఆధారంగా చేసుకుని సూప్‌ తయారు చేయడం వల్ల బిజినెస్‌ మరింత  ముందుకు వెళ్తుంది.