Kuber Dev Favourite Zodiac Signs 2025: జ్యోతిష శాస్త్రం ప్రకారం కుబేరుడికి కొన్ని రాశులు అంటే ఎల్లప్పుడూ ఇష్టమే.. ఈ రాశుల వారు ఎలాంటి పనులు చేసిన డబ్బులు సంపాదించడమే కాకుండా.. ఆర్థిక లాభాలు పొందుతారు. అలాగే జీవితంలో ఎప్పుడూ పొందలేని ఆనందాన్ని కూడా పొందుతారు.
Kuber Dev Favourite Zodiac Signs 2025: హిందూమతంలో అన్ని దేవతామూర్తులకు ఎలాంటి ప్రాముఖ్యత ఉంటుందో కుబేరుడు కి కూడా అలాంటి ప్రాముఖ్యత ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో కుబేర దేవుడిని ప్రధాన దేవుడిగా పూజిస్తారు. అందుకే హిందూ పురాణాల్లో వివిధ దేవతలకు ప్రభువుగా కుబేరుడిగా వర్ణించారు. ప్రతిరోజు కుబేరుడిని పూజించడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు తొలగిపోవడం కాకుండా జీవితంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉంటాయి.
ప్రతి ఏడాది దీపావళి పండగ రోజున లక్ష్మీదేవితో పాటు కుబేరుడిని పూజించడం ఒక సాంప్రదాయం గా వస్తుంది. అయితే ప్రతి శుక్రవారం రోజున కుబేరుడిని పూజించడం వల్ల అనేక రకాల లాభాలు కలుగుతాయని పురాణాల్లో వర్ణించారు. ముఖ్యంగా ఆయన ఆశీస్సులు లభించి అదృష్టవంతులు కూడా అవుతారని అందరూ బాగా నమ్ముతారు.
ప్రతి శుక్రవారం కుబేరుడిని పూజించడం వల్ల లభించి జీవితంలో ఆనందంతో పాటు శ్రేయస్సు కూడా లభిస్తుంది. అంతేకాకుండా కొన్ని రకాల డబ్బు సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. అలాగే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుబేరుడికి ఎంతో ఇష్టమైన రాశులు కూడా ఉంటాయట. వీరికి ఎల్లప్పుడు ఆయన ఆశీస్సులు లభించి.. ఊహించని అదృష్టాన్ని కూడా అందిస్తారట.
కుబేరుడికి ఎంతో ఇష్టమైన రాశుల్లో వృషభరాశి ఒకటి. ఈ రాశి వారికి సంపాదన ఎప్పుడు విపరీతంగా ఉంటుంది. అంతేకాకుండా కుబేరుడు ఆశీస్సులు లభించి ఆనందాన్ని అదృష్టాన్ని ఎప్పుడూ పొందుతారు. ముఖ్యంగా వీరికి ఆర్థిక సమస్యలు వచ్చినప్పటికీ ఎంతో సులభంగా పరిష్కారం అవుతాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా అద్భుతంగా ఉంటుంది.
కర్కాటక రాశి వారికి చంద్రుడు అధిపతిగా ఉంటాడు. అలాగే వీరికి కుబేరుడు ఇష్ట దైవం. కాబట్టి వీరు ప్రతి శుక్రవారం రోజు కుబేరుని పూజించడం వల్ల ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. అంతేకాకుండా జీవితంలో వీరు అధిక మొత్తంలో సంపాదించే ఛాన్స్ కూడా ఉంది. దీంతోపాటు వ్యాపారాల్లో కూడా భారీ లాభాలు పొందుతారు.
ధనస్సు రాశి వారికి కూడా కుబేరుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. అలాగే వీరు పెట్టుబడును పెట్టడంపై ఎక్కువగా ఆసక్తి చూపుతారు. దీనివల్ల ఊహించని ధన లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. అలాగే వీరు ఎంత కష్టపడితే అంత లాభాలు పొందే అదృష్టాన్ని కలిగి ఉంటారు. కాబట్టి కష్టపడి పని చేసేందుకు ఆసక్తి చూపండి.